Advertisementt

వరుణ్ తేజ్ కొత్త చిత్రం అప్ డేట్

Sat 17th Sep 2022 03:26 PM
varun tej,varun tej 13,september  వరుణ్ తేజ్ కొత్త చిత్రం అప్ డేట్
Mega Prince Varun Tej 13 To Take Off On.. వరుణ్ తేజ్ కొత్త చిత్రం అప్ డేట్
Advertisement
Ads by CJ

వైవిధ్యమైన కథలు ఎంపిక తో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తున్న వరుణ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్‌ అపి కొత్త లుక్ తో ఆసక్తిని పెంచుతున్నాడు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా రాబోతున్న ఈ కొత్త సినిమా స్నీక్ పీక్ వీడియోలో వరుణ్ చాలా క్యురియాసిటీతో స్క్రిప్ట్‌ను చదవడం ఎక్సయిటింగా వుంది.

ఈ వీడియోలో కనిపించిన కొటేషన్ హీరో పాత్ర గురించి తెలియజేస్తోంది. స్క్రిప్ట్ చదవడం పూర్తి కాగానే, స్క్రిప్ట్‌  తనకి గొప్ప సంతృప్తిని ఇచ్చినట్లు వరుణ్ తేజ్ ముఖంలో సంతోషకరమైన చిరునవ్వు కనిపించింది. వీడియో చివర్లో  స్క్రిప్ట్‌పై ఒక బొమ్మ ఎయిర్‌క్రాఫ్ట్‌ని వుంచడం, విమానం టేకాఫ్ అవుతున్నట్లు వినిపించిన సౌండ్స్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. వీడియో చూపించినట్లు యధార్ధ  సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ కథ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.

ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ చాలా విలక్షణంగా వుంది. ఈ మెగా ప్రాజెక్ట్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది.

Mega Prince Varun Tej 13 To Take Off On..:

Mega Prince Varun Tej 13 To Take Off On September 19th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ