సీత రామం తో తెలుగు, తమిళ, మళయాలంలోనే కాదు హిందీలోనూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. హను రాఘవపూడి తదుపరి మూవీపై అందరిలో చాలా అంటే చాలా క్యూరియాసిటీ మొదలైంది. దుల్కర్ హీరోగా, మృణాల్ హీరోగా తెరకెక్కిన సీత రామం మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అయితే ఈ కథనే హను రాఘవపూడి హీరో నాని, విజయ్ దేవరకొండకి చెప్పగా.. వారు రిజెక్ట్ చేసారని, అదే కథ తో మలయాళ హీరో దుల్కర్ ని ఒప్పించి సీతారామం మూవీ చేశారనే టాక్ ఉంది. తాజాగా ఈ విషయమై ఆయన్ని అడగగా.. దానికి హను రాఘవపూడి ఇలా స్పందించారు.
నేను ఆ హీరోలని కలిసిన మాట వాస్తవం. నానీని కలిసాను, అలాగే విజయ్ దేవరకొండను మాత్రమే కాదు రామ్ ను కలిసిన మాట కూడా నిజమే. ఆ ముగ్గురు హీరోలతో కథా చర్చలు జరిపిన మాట కూడా వాస్తవమే. కానీ సీత రామం కథ కోసం మాత్రం కాదు. వాళ్లకి నేను చెప్పిన కథలు వేరు. సెకండ్ వరల్డ్ వార్ బ్యాగ్డ్రాప్ కి సంబందించిన కథని నాని కి చెబితే, విజయ్ దేవరకొండకి రామ్ కి వేరు వేరు జోనర్స్ కథలు చెప్పాను. కానీ సీతా రామం కథ పట్టుకుని దుల్కర్ ను తప్ప ఎవరినీ కలవలేదు.. అంటూ హను రాఘవపూడి సీత రామం పై వస్తున్న రూమర్స్ ని కొట్టిపారేశారు.