రాజమౌళి ట్రిపుల్ ఆర్ సంబరం ఇంకా ముగియలేదు. ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ భీమ్ ఆస్కార్ కి నామినేట్ అవడమే కాదు, ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆస్కార్ కి నామినేట్ అవడం ఆ హీరోల ఫాన్స్ ఖుషి అయ్యేలా చేసింది. ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి చెయ్యబోయే ప్రాజెక్ట్ విషయాలను ఆయన రివీల్ చేసేసారు. మహేష్ బాబు తో తాను చేస్తున్న మూవీ నేపధ్యాన్ని రివీల్ చేసి సర్ ప్రైజ్ చేసిన రాజమౌళి.. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీ గానే చెయ్యబోతున్నారు. మరి మహేష్ కి హీరోయిన్ విషయంలోనూ రాజమౌళి భారీ స్కెచ్ లు వేస్తున్నట్లు తెలుస్తుంది.
దానిలో భాగంగానే ఆయన సీత అదేనండి అలియా భట్ నే మహేష్ బాబు కోసం తెచ్చుకొనే ప్లాన్ లో ఉన్నారట. ప్రస్తుతం అలియా భట్ ప్రెగ్నెంట్. మహేష్ తో మూవీ మొదలు పెట్టేసరికి ఆమె డెలివరీ పూర్తవుతుంది. తర్వాత ఆమె సినిమాలు చేస్తే ఖచ్చితంగా మహేష్ తో రొమాన్స్ కోసం అలియా నే రాజమౌళి తీసుకొస్తారట. ఒకవేళ అలియా భట్ కి కుదరకపోయినా.. దీపికా ని కూడా ఒప్పించాలనే ప్లాన్ లో రాజమౌళి ఉన్నారట. ఫైనల్ గా మహేష్ బాబు పక్కన నటించబోయే ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చెయ్యాల్సిందే.