బిగ్ బాస్ సీజన్ 6 లో కొన్ని వింత పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. అంటే సీజన్ 6 మొదలైన వారంలో ఎవరిని హౌస్ ఎనుండి ఎలిమినేట్ చెయ్యకుండా ట్విస్ట్ ఇచ్చారు. అలాగే 21 మంది హౌస్ లో అడుగుపెట్టడమే రికార్డ్. అదలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 6 మొదటివారంలో బాలాదిత్య కెప్టెన్ కాగా.. రెండో వారానికి గాను రాజ్ కెప్టెన్ అయ్యాడు. ఈ వారం మొత్తం నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్ తోనే గడిచిపోయింది. రెండో వారంలో ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్ పై సోషల్ మీడియాలో అప్పడే రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చేసాయి. ముఖ్యంగా ఇద్దరు డేంజర్ జోన్ లో కొనసాగుతున్నట్టుగా పోల్స్ చెబుతన్నాయి. ఈ వారం ఒక్క ఓట్ పడిన వారు కూడా నామినేషన్స్ లోకి వెళ్లిపోయారు.
ఫైనల్ గా ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో రేవంత్, ఫైమా, గలాటా గీతూ, ఆది రెడ్డి, అభినయ, షాని, రాజ్, మెరీనా అండ్ రోహిత్ లు ఉండగా.. ఓటింగ్ లో రేవంత్ మొదటి నుండి స్ట్రాంగ్ గానే నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతుంటే తర్వాత ప్లేస్ లో ఫైమా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత స్థానాల్లో కొద్దిగా అటు ఇటుగా గీతూ, ఆది రెడ్డి, రాజ్ లు ఉండగా.. ఆ తర్వాత మెరీనా -రోహిత్ లు అలాగే రాజ్ కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే ఈవారం డేంజర్ జోన్ లో అభినయ తో పాటుగా షమీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఆదివారం ఎపిసోడ్ లో అభినయ కానీ, షామి కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.