Advertisementt

బాలయ్య ఆగమనానికి రంగం సిద్ధం

Sat 17th Sep 2022 08:16 AM
unstoppable,nbk2,aha  బాలయ్య ఆగమనానికి రంగం సిద్ధం
Unstoppable With NBK2 బాలయ్య ఆగమనానికి రంగం సిద్ధం
Advertisement
Ads by CJ

అన్ స్టాపబుల్ అంటూ నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా స్టేజ్ పై చేసిన కామెడీ, అల్లరి అభిమానులనే కాదు ఆడియన్స్ ని సైతం ఆశ్చర్య పరిచింది. మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోలని మొదలుకుని మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరోల వరకు బాలయ్య చేసిన మాటల మ్యాజిక్ ని ఆస్వాదించారు. ఈ షో లో సినిమాల ప్రమోషన్స్ ఒక ఎత్తు పర్సనల్ లైఫ్ లోని సిల్లీ విషయాలు ఇంకో ఎత్తు అన్నట్టుగా బాలయ్య అందరిని ఆటాడించారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 ఆగష్టు లోనే అన్నప్పటికీ.. అది ఇప్పుడు అక్టోబర్ కి చేంజ్ అయినట్లుగా తెలుస్తుంది. 

అతి త్వరలోనే ఆహాలో అన్ స్టాపబుల్ సీజన్ 2 దెబ్బకి థింకింగ్ మారిపోవాల.. అంటూ ఆహా నుండి కబురు వచ్చేసింది. మరి సీజన్ 2 లో బాలయ్య మొదటగా ఇంటర్వ్యూ చెయ్యబోయే గెస్ట్ పై బోలెడంత ఆసక్తి, ఆత్రుత ప్రేక్షకుల్లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఫస్ట్ గెస్ట్ అంటూ ప్రచారం గట్టిగానే జరిగింది. ఫైనల్ గా ఈ షో కి మొదటగా రాబోయే అతిధి ఎవరన్న విషయం పక్కనబెడితే బాలయ్య రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన చేసే కామెడీ, ఆయన వేసే పంచ్ లు అన్ని ఈ షోకి హైలెట్ గా నిలుస్తాయని ఎగ్జైట్ అవుతూ ఎదురు చూపులు మొదలెట్టేసారు.

Unstoppable With NBK2 :

Unstoppable With NBK2 soon

Tags:   UNSTOPPABLE, NBK2, AHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ