ఈ రోజు సెప్టెంబర్ 16 లెక్కకు మించిన సినిమాలన్నీ బాక్సాఫీసు మీదకి తుఫానులా వచ్చిపడినాయి. అన్ని సినిమాలొచ్చినా ఏ సినిమాకి సరైన ఓపెనింగ్ రాలేదు. కొన్ని సినిమాలకైతే చాలా సెంటర్స్ లో షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇంత పోటీ మధ్యన కూడా ధీటుగా నిలబడి కంటెంట్ కి ఇప్పటికి ఆడియన్స్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేదానికి నిదర్శనంగా నిలుస్తుంది.. శర్వా నటించిన ఒకే ఒక జీవితం చిత్రం.
ఆంధ్ర-తెలంగాణ రెండు స్టేట్స్ లోని థియేటర్స్ చూసుకుంటే ఒకే ఒక జీవితం ఇంకా స్ట్రాంగ్ గానే నిలబడి ఉంది. ఫస్ట్ డే కి వచ్చిన విశ్లేషణలు కానీ, విమర్శలు కానీ, చేసుకున్న సక్సెస్ మీట్స్ కానీ, ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ పక్కనబెట్టేస్తే.. ఈరోజు ఇది సక్సెస్ శర్వా అనేలా ఒకే ఒక జీవితం నిరూపించింది. ఎంజాయ్ శర్వా అండ్ ఇది క్యారీ చెయ్.. నీ కెరీర్ వెలిగిపోవడం ఖాయం.