Advertisementt

పారితోషకం స్కై హై అంటున్న రష్మిక

Fri 16th Sep 2022 11:49 AM
rashmika mandanna,pan-indian projects,pushpa 2  పారితోషకం స్కై హై అంటున్న రష్మిక
Rashmika Mandanna Hikes Her Salary Again Even Before Her Pushpa 2 పారితోషకం స్కై హై అంటున్న రష్మిక
Advertisement
Ads by CJ

లక్కీ బ్యూటీ రష్మిక హ్యాండ్ ప్రస్తుతం రేజింగ్ లో ఉంది. టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ కాదు.. కోలీవుడ్ లోనూ పాగా వెయ్యడానికి రెడీ అయ్యింది. మరి ఏ భాషలో చేసినా.. హిందీలో చేసిన సినిమాలతోనే హీరోయిన్స్ కి కిక్ వస్తుంది. ఇప్పుడు అదే కిక్ ని ఆస్వాదిస్తోంది రష్మిక. బాలీవుడ్ లో వరుసగా చేస్తున్న ప్రాజెక్ట్స్ తో బాగా ఎగ్జైట్ అవుతున్న రష్మిక ప్రస్తుతం అక్కడ విడుదల కాబోయే గుడ్ బై, మిషన్ మజ్ను మూవీస్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంది. రణబీర్ కపూర్ తో యానిమల్ చిత్రంలోనూ మెరుస్తన్న రశ్మికకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ ఛాన్స్ వచ్చిందనే టాక్ మొదలయ్యింది.

NTR30 లో హీరోయిన్ గా రష్మిక అంటూ వార్తలు రావడం వెనుకే రష్మిక పారితోషకం పెంచేసినట్లుగా వార్తలు మొదలయ్యాయి. పుష్ప హిట్ కి ముందు నాలుగు కోట్లు వసూలు చేసిన రష్మిక ఆ పాన్ ఇండియా హిట్ తర్వాత ఐదు కోట్లు చేసిందట. పుష్ప ద రూల్ కి రష్మిక పారితోషకం ఐదు కోట్లు చేసేసింది అనే టాక్ వినిపిస్తుంది. ఇక నుంచి చేసే ప్రతి సినిమాకు కూడా 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. పుష్ప ద రూల్ పాన్ ఇండియా మూవీ చేతిలో ఉండడం, తమిళ్ విజయ్ సినిమా ఉండడం, ముఖ్యంగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారుతున్న టైం లో రష్మిక ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యి పారితోషకం పెంచేసినట్లుగా తెలుస్తుంది.

Rashmika Mandanna Hikes Her Salary Again Even Before Her Pushpa 2:

Rashmika Mandanna Demanding Massive Remuneration For Pan-Indian Biggies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ