Advertisementt

నాగ్ బిగ్ బాస్ కి దారుణమైన టీఆర్పీ

Fri 16th Sep 2022 10:24 AM
bigg boss 6,bigg boss telugu,akkineni nagarjuna  నాగ్ బిగ్ బాస్ కి దారుణమైన టీఆర్పీ
Bigg Boss 6 Terrible TRP నాగ్ బిగ్ బాస్ కి దారుణమైన టీఆర్పీ
Advertisement
Ads by CJ

నార్త్ అంత కాకపోయినా.. సౌత్ బిగ్ బాస్ కి ఎంతోకొంత ఆదరణ లేకపోతే యాజమాన్యం సీజన్ల మీద సీజన్లు పెట్టి కంటెస్టెంట్స్ కి పారితోషకాలు ఇవ్వదు. అయితే సీజన్ 1 ని యంగ్ టైగర్ హోస్ట్ చెయ్యడంతో బుల్లితెర ప్రేక్షకులు ఆ సీజన్ కి బాగా కనెక్ట్ అయ్యారు. తర్వాత ఎన్టీఆర్ లేకపోయినా నాని బాగానే ఆడించాడు. ఆ తర్వాత సీజన్ 3 నుండి సీజన్ 6 వరకు నాగార్జునే బిగ్ బాస్ హోస్ట్ గా వస్తున్నారు. అయితే బిగ్ బాస్ వీక్ డేస్ ఎపిసోడ్స్ కి ఆదరణ ఎలా ఉన్నా.. వీకెండ్ ఎపిసోడ్స్ కి ఓపెనింగ్, ఫినాలే ఎపిసోడ్స్ కి అదిరిపోయే టీఆర్పీ వస్తుంది. కానీ బిగ్ బాస్ సీజన్ 6 ఓపెనింగ్ ఎపిసోడ్ కి నాగార్జున మ్యాజిక్ పని చెయ్యలేదు అనిపిస్తుంది.

ఎందుకంటే రెండు వారాల క్రితమే మొదలైన సీజన్ 6 ఓపినింగ్ ఎపిసోడ్ కి అలియా భట్-రణబీర్ కపూర్ లు గెస్ట్ లు రావడమే కాదు, కంటెస్టెంట్స్ ని ఒకొక్కరిగా పరిచయం చేస్తూ ఆసక్తిని పెంచుతూ హౌస్ లోకి పంపారు నాగ్. కానీ కంటెస్టెంట్స్ లిస్ట్ ఓపెనింగ్ డే కన్నా ముందే అంటే వారం ముందే లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి దారుణమైన టీఆర్పీ వచ్చింది. సీజన్ 6 ఓపెనింగ్ ఎపిసోడ్ కి కేవలం 8.8 టీఆర్పీనే నమోదు చేయడం అందరికి షాకిచ్చింది. దానికి కారణం అదే రోజు ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ఉండడం ఒకటైతే.. బుల్లితెర ప్రేక్షకుల్లో బిగ్ బాస్ మీద ఆదరణ తగ్గడమా? లేదంటే ఊరు పేరూ లేని వారిని హౌస్ లోకి పంపించడమా ? అనేది తెలియక యాజమాన్యం ఇప్పుడు తలలు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

Bigg Boss 6 Terrible TRP:

Bigg Boss 6 Telugu TRP Rating: Here Is The Reason Behind A Huge Drop In Akkineni Nagarjuna Show!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ