ఒకప్పుడు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని వదిలి చాలామంది బయటికి వచ్చేసారు. కానీ జబర్దస్త్ లాంటి ఓ షో లో నిలబడలేక చాలా ఛానల్స్ తిరుగుతున్నారు. ఈమధ్యనే ఆది, సుధీర్, శ్రీను, అనసూయలు జబర్దస్త్ ని వదిలేసారు. అందులో సుధీర్, అనసూయ పూర్తిగా జబర్దస్త్ కి దూరం కాగా.. శ్రీను, ఆది లు కొద్ది నెలల గ్యాప్ తో తిరిగి జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇదంతా జరక్కముందు.. అంటే జబర్దస్త్ పెట్టిన రెండేళ్ళకి కొంతమంది టీం లీడర్స్ కలిసి కట్టుగా జబర్దస్త్ ని వదిలేసారు. వారే జబర్దస్త్ తో పాటుగా ఎంట్రీ ఇచ్చిన ధనరాజ్, శ్రీను, వేణు లాంటి వాళ్ళు జబర్దస్త్ లో ఫెమస్ అయ్యి వెండితెర మీద వెలిగిపోదాం, పక్క ఛానల్ కి వెళ్లిపోదామంటూ జబర్దస్త్ ని వదులుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు మళ్ళీ జబర్దస్త్ లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వలేకపోయారు.
తాజాగా ధనరాజ్ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. జబర్దస్త్ నుండి వెళ్ళిపోయినందుకు ఇప్పటికి బాధగానే ఉంది.. అప్పట్లో వేణు చెప్పినట్లు చెయ్యకుండా ఉంటే బావుండేది అని, జబర్దస్థ్ లో మంచి ఊపులో ఉండగా.. పక్క ఛానల్ లో యాంకరింగ్ చేసే అవకాశం రావడంతో.. వేణు వెళదామన్నాడు. అక్కడ కామెడీ, ఇక్కడ యాంకరింగ్ అదేం ప్రాబ్లెమ్ అవ్వదని చెప్పగా.. నేను వెళ్లి ఆ షో షూట్ లో పాల్గొన్న తర్వాత జబర్దస్త్ యాజమాన్యంతో మాట్లాడగా రెండిట్లో కనిపిస్తే ఆ ఎక్స్ క్లూజివ్ నెస్ పోతుంది అని అనడంతో.. నేను వేణు ఆ ఛానల్ లోనే ఉండిపోయాం.
తర్వాత నేను వేణు ని చాలాసార్లు తిట్టాను. అనవసరంగా జబర్దస్త్ వదిలేశాం అని. మళ్ళీ జబర్దస్త్ కి వెళదామనుకున్నా.. అక్కడ మా టీం లో చేసిన కంటెస్టెంట్స్ టీం లీడర్స్ గా మారి వాళ్ళ స్కిట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకూడదని వెళ్ళలేదు, ఒకవేళ వెళ్ళినా వాళ్ళ స్కిట్స్ లో కంటెస్టెంట్స్ గా చేయలేము అంటూ ధనరాజ్ జబర్దస్త్ నుండి వచ్చాక ఎంతగా బాధపడ్డాడో బయటపెట్టాడు.