ఇప్పటికే మూడు పాన్ ఇండియా మూవీస్ లో నటించడం, బాహుబలితో ప్రపంచ స్టార్ గా పరిచయం కావడంతో ప్రభాస్ కి ఎక్కడలేని క్రేజ్ ఉంది. సౌత్ నుండే కాదు, ప్రభాస్ కి నార్త్ నుండి అంతే క్రేజ్ ఉంది. అటు పారితోషకం విషయంలోనూ ప్రభాస్ బాలీవుడ్ హీరోలకే చెక్ పెట్టేసాడు. ఆదిపురుష్ తో ప్రభాస్ 120 నుండి 130 కోట్ల మధ్యన పారితోషకం అందుకోబోతున్నాడనే టాక్ ఉంది కూడా. చేతిలో ఏకంగా నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో రెండు సెట్స్ మీదుంటే రెండు మొదలు కావాల్సి ఉంది. సలార్, ప్రాజెక్ట్ K చిత్రాల రేంజ్ చూస్తేనే ప్రభాస్ కున్న డిమాండ్ అర్ధమవుతుంది. అందుకే ఆగస్టు నెలకు గాను ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వేలో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసాడు.
ప్రతి నెలా ఆర్మాక్స్ మీడియా దేశంలోని అత్యుత్తమ, క్రేజీ స్టార్స్ ని ఎంపిక చేసి అందులో టాప్ 10 లిస్ట్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందులో ఎక్కువగా మహేష్ నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగేవాడు. ఆ తర్వాత ఆ స్థానాలు ఎవ్వరికి దక్కినా.. ఆగష్టు నెలలో మాత్రం ప్రభాస్ ఆ నెంబర్ వన్ ప్లేస్ ని సొంతం చేసుకున్నాడు. సాహో, రాధే శ్యామ్ చిత్రాలు ప్లాప్ అయినా ప్రభాస్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు అనడానికి ఈ ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వేనే ఉదాహరణ అంటూ ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ తర్వాత స్థానాల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లు ఉన్నారు.