Advertisementt

హిట్‌2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

Thu 15th Sep 2022 07:47 PM
adivi sesh,hit 2 movie,nani  హిట్‌2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది
Adivi Sesh HIT 2 movie gets a new date హిట్‌2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది
Advertisement

నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ సూపర్ హిట్ అవడంతో అని దానికి సీక్వెల్ గా హిట్ 2 ని తెరకెక్కించాడు. అయితే విశ్వక్ సేన్ ని తప్పించి ఈ ఏడాది మేజ‌ర్ సినిమాతో భారీ హిట్ సాధించిన హీరో అడివి శేష్‌ హీరోగా హిట్ 2 తెరకెక్కింది. హిట్ సినిమాతో ఆడియెన్స్ మెప్పించిన ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలోనే హిట్ 2 ద సెకండ్ కేస్ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాను డిసెంబ‌ర్ 2న రిలీజ్ చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

ఎవ‌రు, గూఢ‌చారి వంటి చిత్రాల‌తో వ‌రుస సూప‌ర్ హిట్స్ కొట్టిన టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఇందులో కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి పాత్రలో మెప్పించున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ అమ్మాయి మిస్సింగ్‌ కేసుని ఎలా డీల్‌ చేశాడనే కాన్సెప్ట్‌తో హిట్‌ ‌(మోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌) సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి ఈ ఎగ్జయిటింగ్‌ జర్నీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.  

అలాగే హిందీలోనూ హిట్ సినిమాను అదే పేరుతో రీమేక్ చేసి అక్క‌డ కూడా హిట్ సాధించారు. ఇప్పుడు హిట్ ఫ్రాంఛైజీగా హిట్ 2 సినిమాను పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్‌ డ్రామాగా, మరిన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించారు. హిట్ 2 రిలీజ్ డేట్‌ను డిసెంబ‌ర్ 2గా అనౌన్స్ చేయ‌టంతో పాటు రిలీజ్ డేట్‌ పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Adivi Sesh HIT 2 movie gets a new date:

Adivi Sesh HIT 2 movie seals its release

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement