Advertisementt

ప్రాజెక్ట్ K కోసం ఆ రేంజ్ యాక్షన్ స్కెచ్

Thu 15th Sep 2022 06:09 PM
prabhas,project k,amitab  ప్రాజెక్ట్ K కోసం ఆ రేంజ్ యాక్షన్ స్కెచ్
Crazy update on Project K ప్రాజెక్ట్ K కోసం ఆ రేంజ్ యాక్షన్ స్కెచ్
Advertisement
Ads by CJ

నాగ్ అశ్విన్-పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K షూటింగ్ ప్రస్తుతానికి బ్రేకిచ్చారు. కారణం ప్రభాస్ కి చిన్న సర్జరీ వలన ఆయన విదేశాలకు వెళ్లడం, అలాగే ఆయన తిరిగొచ్చాక ప్రాజెక్ట్ K ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అనుకునేలోపు ప్రభాస్ పెద్దన్నగారు కృష్ణం రాజు అకాలమరణంతో ప్రాజెక్ట్ K షూటింగ్ అక్టోబర్ వరకు వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఈలోపు నాగ్ అశ్విన్ మిగతా పనులు చూసుకుంటారట. తాజగా ప్రాజెక్ట్ K గురించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

అదేమిటంటే ప్రాజెక్ట్ K కోసం నాగ్ అశ్విన్ హాలీవుడ్ నుండి యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ని తీసుకురాబోతున్నారట. ప్రాజెక్ట్ K లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ని హాలీవుడ్ రేంజ్ లోనే డిజైన్ చెయ్యడంతో.. అక్కడినుండి కొంతమంది ఫైట్ మాస్టర్స్ ని తీసుకువస్తున్నారట. అశ్వద్ధామ కేరెక్టర్ లో కనిపించబోతున్న అమితాబచ్చన్ కి-ప్రభాస్ కి మధ్యన బిగ్ యాక్షన్ సీన్ ఒకటి ఉండబోతుంది అంటున్నారు. అమితాబ్-ప్రభాస్ ఫైట్ లో నిజమెంతుందో తెలియదు కానీ.. హాలీవుడ్ నుండి ఫైట్ మాస్టర్స్ మాత్రం పక్కాగా దిగుతున్నారట. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పడుకొనే, దిశా పటాని రొమాన్స్ చేస్తున్నారు.

Crazy update on Project K:

Prabhas Project K update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ