మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా దానిని మలయాళ లూసిఫర్ తో కంపేర్ చేసి చూసి మరీ ట్రోల్స్ మొదలు పెడుతున్నారు ఇతర హీరోల ఫాన్స్. చిరు లూసిఫర్ రీమేక్ చేస్తున్నారనగానే అమెజాన్ ప్రైమ్ లో ఉన్న లూసిఫర్ ని వీక్షించేసారు. అంతేకాకుండా గాడ్ ఫాదర్ నుండి పోస్టర్ వచ్చినా, టీజర్ వచ్చినా.. ఇప్పుడు రాబోతున్న సాంగ్ చూసిన ఆడియన్స్ అది లూసిఫర్ ని పోలి ఉందా.. లేదా.. అంటూ కంపేర్ చేసి మరీ గాడ్ ఫాదర్ మేకర్స్ ని ఆడుకుంటున్నారు. లూసిఫర్ మోహన్ లాల్ వైట్ అండ్ వైట్ వేస్తె ఆయన బాడీ గార్డ్ బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తారు.
కానీ ఇక్కడ మెగాస్టార్ చిరు బ్లాక్ డ్రెస్. ఆయన బాడీ గార్డ్ సల్మాన్ ఖాన్ బ్లాక్ డ్రస్సే. అటు లూసిఫర్ లో విలన్ వివేక్ ఒబెరాయ్ ని కొడుతున్నప్పుడు ఐటెం సాంగ్ వస్తే.. ఇక్కడ చిరు-సల్మాన్ సాంగ్ వేసుకుంటున్నారు. అంతేకాదు..పెద్ద విలన్ లా ఫీలవుతూ సత్య దేవ్ కోసం ఏకంగా సల్మాన్ ఖాన్ నే బాడీ గార్డ్ గా దింపారు.. అక్కడ మోహన్ లాల్ కి పృథ్వీ రాజ్ పర్ఫెక్ట్ గా అనిపించారు. అందుకు తగ్గ విలన్ గా వివేక్ ఒబెరాయ్ కర్ణింగ్ గా కనిపించారు. కానీ చిన్న నటుడు సత్య దేవ్ కి నయనతార వైఫ్, ఆయన్ని కొట్టడానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అంటూ ట్రోల్ చేస్తుంటే.. మేకర్స్ మాత్రం థార్ మార్ సాంగ్ కోసం హైప్ క్రియేట్ చేస్తూ పోస్టర్స్, ప్రోమోస్ అంటూ హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ పై మరింతగా ట్రోల్స్ ఎక్కువయ్యాయి. అసలు సాంగ్ కోసం హైప్ క్రియేట్ చేస్తున్నారో.. ట్రోలర్స్ కి మేత వేస్తున్నారో అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.