ఎన్టీఆర్ - కొరటాల కాంబో NTR30 ఎప్పుడు మొదలవుతుందో కానీ.. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఖాళీగా ఉండడం చూస్తున్న ఆయన ఫాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ సెట్స్ మీద సందడి చేస్తారా అని కాపు కాచుకుని కూర్చున్నారు. ఇటు ఎన్టీఆర్-కొరటాల మేకర్స్ కూడా ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. దసరా నవరాత్రుల్లో పూజా కార్యక్రమాలతో మొదలై.. అక్టోబర్ రెండో వారం నుండి రెగ్యులర్ షూటింగ్ వెళ్లొచ్చనే ఊహాగానాలు ఉన్నప్పటికీ.. అది అధికారికంగా తెలిస్తేనే ఫాన్స్ కూల్ అవుతారు.
ఇక NTR30 అనుకున్నప్పుడు హీరోయిన్ గా అలియా భట్ ని ఎంపిక చేసింది టీం. కానీ అలియా భట్ పెళ్లి చేసుకుని పిల్లల ప్లానింగ్ తో ఎన్టీఆర్ సినిమా నుండి తప్పుకోవడంతో NTR30 కి హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి. అప్పటినుండి కియారా కోసం NTR30 టీం ట్రై చేస్తున్న ఆమె కి డేట్స్ ఖాళీ లేకపోవడంతో.. కియారా ప్రస్తుతం కొరటాల అడిగినా వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. డైలమాలో ఉన్న మేకర్స్ ఫైనల్ గా పాన్ ఇండియా హిట్ కొట్టి బాలీవుడ్ లో రేజింగ్ లో ఉన్న రష్మిక ని ఎన్టీఆర్ కోసం ఫైనల్ చేసారనే టాక్ మొదలయ్యింది. మరి నిజంగా ఇదే నిజమైతే రష్మిక ని ఆపడం ఎవరి తరము కాదు.