నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుని దాదాపు ఏడాది కావొస్తుంది. గత ఏడాది అక్టోబర్ మొదటి వారం అదో పెద్ద సంచలం. అది జరిగిపోయిన, ముగిసిపోయిన కథ అయినప్పటికీ.. ఇప్పటికి వారి విడాకులకు సంబందించిన ప్రశ్నలు అక్కినేని ఫ్యామిలీకి ఎదురవుతూనే ఉన్నాయి. ఇంతకుముందు లాల్ సింగ్ చద్దా టైం లో నాగ చైతన్య ని హిందీ ఇంటర్వూస్ లో మీడియా మిత్రులు అడిగారు. దానికి చైతూ ఆన్సర్ కూడా ఇచ్చాడు. తాజాగా నాగార్జున బ్రహ్మాస్త్ర సక్సెస్ ఈవెంట్ కి ముంబై వెళ్ళినప్పుడు సామ్-చైతు డివోర్స్ మేటర్ ని కదిపింది మీడియా.
చై-సామ్ విడాకులు తీసుకున్నప్పుడే నాగర్జున వారిద్దరికీ నచ్చ చెప్పాలని చూసాం వినలేదు, సమంతను మా ఫ్యామిలీ మెంబెర్ గానే ట్రీట్ చేస్తున్నాం అంటూ చెప్పారు. నాగ చైతన్య డివోర్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన సినిమాల కన్నా ఆయన పర్సనల్ లైఫ్ పై చర్చ జరగడం, ఆయన పర్సనల్ లైఫ్ డిస్ట్రబ్ అవడం తండ్రిగా మీకు ఆందోళ కలిగిస్తుందా అని అడగగా.. దానికి నాగార్జున సమాధానమిస్తూ.. చైతన్య హ్యాపీగా ఉన్నాడు. నేను దాన్ని చూస్తున్నాను. నాకు అది చాలు. ఇప్పుడు మేం చైతు విడాకుల విషయం గురించి ఆలోచించటం లేదు. తమ జీవితాల నుండి ఆ మేటర్ వెళ్లిపోయింది. అలాగే అందరి జీవితాల్లో నుంచి ఆ విడాకుల మేటర్ వెళ్లిపోతుందని ఆశిస్తున్నాం.