శర్వానంద్ గత చిత్రాల ప్లాప్ ఒకే ఒక జీవితం పై పడుతుంది అనుకున్నారు. ఎందుకంటే ఆ సినిమా బిజినెస్ కూడా అంతంతమాత్రం గానే జరిగింది. శర్వానంద్ కెరీర్ డౌన్ లో ఉండడంతో ఒకే ఒక జీవితానికి బడ్జెట్ కూడా తక్కువే పెట్టారు. అందుకు తగ్గట్టుగానే 7.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకే ఒక జీవితం విడుదలయ్యాక ఊహించని హిట్ టాక్ రావడంతో టార్గెట్ మూడు రోజుల్లోనే ముగుస్తుంది అనుకున్నారు. అంటే ఫస్ట్ వీకెండ్ లోపులోనే 7.5 కోట్లు శర్వానంద్ తెస్తాడని అనుకున్నారు. ఒక వారానికి కానీ శర్వా తన టార్గెట్ రీచ్ అయ్యాడనిపిస్తుంది. 7.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే.. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ గా బరిలోకి దిగిన శర్వా ఒకే ఒక జీవితం ఆరు రోజులకి గాను 7.30 కోట్లు వసూలు చేసింది. అంటే మొదటి వారం పూర్తయితే కానీ శర్వానంద్ ఫుల్ గా బ్రేక్ ఈవెంట్ సాధిస్తాడన్నమాట. తర్వాత వచ్చే కలెక్షన్స్ లాభాలే. కానీ రేపు శుక్రవారం శర్వా కి పోటీ మొదలవుతుంది. ఈ వారం మూడు పేరున్న సినిమాలు, ఇంకాకొన్ని పేరు లేని సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. దానితో ఒకే ఒక జీవితం కలెక్షన్స్ కూడా తగ్గిపోతాయన్నమాట. ఒకే ఒక జీవితం 6 డేస్ కలెక్షన్స్ మీకోసం..
ఒకే ఒక జీవితం 6 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..
ఏరియా కలెక్షన్స్
నైజాం 2.38కోట్లు
సీడెడ్ 0.37కోట్లు
ఉత్తరాంధ్ర 0.46కోట్లు
ఈస్ట్ 0.35కోట్లు
వెస్ట్ 0.24కోట్లు
గుంటూరు 0.32కోట్లు
కృష్ణా 0.30కోట్లు
నెల్లూరు 0.19కోట్లు
ఏపీ అండ్ టీఎస్ 6 డేస్ షేర్: 4.67 కోట్లు
ఇతర ప్రాంతాల్లో 0.38కోట్లు
తమిళనాడు 0.85కోట్లు
ఓవర్సీస్ 1.40కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 6 డేస్ కలెక్షన్స్ - 7.30కోట్లు (షేర్)