నాగార్జున లేటెస్ట్ గా నటించిన బాలీవుడ్ బ్రహ్మాస్త్రకి టాక్ ఎలా ఉన్నా 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టడంతో అక్కినేని ఫాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. లేదంటే నాగ చైతన్యకి లాల్ సింగ్ చద్దా షాక్ ఇచ్చినట్టుగా నాగార్జునకి బ్రహ్మాస్త్ర షాక్ ఇస్తుందేమో అని భయపడ్డారు. కానీ అలా జరక్కపోయేసరికి వారు కూల్ అయ్యారు. ఇక బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ అప్పుడు నాగార్జున టీం తో కలిసి ఊరూరా తిరిగారు. బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ ఫినిష్ అయ్యాయి. ద ఘోస్ట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉండాల్సిన టైం లో నాగార్జున ముంబైలోని కరణ్ జోహార్ తో మీటడం హాట్ టాపిక్ గా మారింది.
అంటే నాగార్జున మరో బాలీవుడ్ మూవీ ఏమైనా ఒప్పుకుంటున్నారా? లేదంటే తన ఘోస్ట్ సినిమా ని పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేసే ఆలోచనలో కరణ్ ని ధర్మా ప్రొడక్షన్ ఆఫీస్ లో కలిసారా? అనే విషయం పై అక్కినేని ఫాన్స్ తెగ చర్చించేస్తున్నారు. ఒకవేళ ప్రవీణ్ సత్తారు తో చేసిన ఘోస్ట్ మూవీ యాక్షన్ నార్త్ ఇండియన్స్ ని ఆకట్టుకుంటుంది.. అందుకే హిందీలోనూ ఈ మూవీ రిలీజ్ ప్లాన్ లో భాగంగానే కరణ్ జోహార్ తో నాగ్ చర్చలు జరుపుతున్నాడంటూ అప్పుడే సోషల్ మీడియాలో ఆ న్యూస్ హాట్ న్యూస్ గా మారిపోయింది. మరి ఘోస్ట్ పాన్ ఇండియా మూవీనా లేదంటే అనేది ఓ రెండు మూడు రోజుల్లో క్లారిటీ రావడం ఖాయం.