Advertisementt

అందరూ విజయ్ ని ఫాలో అవ్వాలి

Thu 15th Sep 2022 10:04 AM
natti kumar,vijay deverakonda,star heroes  అందరూ విజయ్ ని ఫాలో అవ్వాలి
Natti Kumar sensational comments on star heroes అందరూ విజయ్ ని ఫాలో అవ్వాలి
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టార్స్ పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూ  లో పాల్గొన్న ఆయన హీరోలు మేకప్ లు వేసుకుని షూటింగ్ లు చేయడం కాదని, విజయ్ దేవరకొండ లాగా నెల రోజులు సినిమా కి ప్రమోట్ చేయాలని అన్నారు. అంతేకాదు సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టారని, అలా ఈ రోజుల్లో ఏ హీరో కూడా లేరని అన్నారు. అందరూ అలా ఆలోచిస్తే సినిమా బ్రతుకుతుంది అని చెప్పారు.

సినిమా ఎలా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని అన్నారు. సినిమా ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్, నిర్మాత చేతిలో ఉంటుంది.. తన పార్ట్ సినిమా ప్రమోషన్ చేయడం. అది బాగా చేశారని ఆయన అన్నారు. ఏదేమైనా లైగర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండ చేసిన ఫ్యాన్ డం టూర్ ఇప్పటివరకు ఏ హీరో కూడా చేయలేదని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఖుషి సినిమా చేస్తున్నాడు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ను డిసెంబర్ 23 విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.

Natti Kumar sensational comments on star heroes:

Natti Kumar comments on Vijay Deverakonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ