బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ లోని సగం మందికి పైగా గలాటా గీతు పై పీకలదాకా పెట్టుకున్నారు. ఆమె కూడా అందరిని బుగ్గ గిల్లి జోల పాడుతూ తగవు పెట్టుకుంటుంది. నామినేషన్స్ లో చాలామంది గీతు నే టార్గెట్ చేసారు. కానీ గీతు మాత్రం తాను గెలవడానికి అమ్మా నాన్న లని కూడా లెక్క చెయ్యను మీరో లెక్కా అంటూ తెగించేసి ఆడుతుంది. తాజాగా రెండో వారంలో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. అందులో బేబీస్ ని ఇచ్చిన బిగ్ బాస్ వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు అవకాశం ఇవ్వగా.. ముందుగా చంటి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. అంతకుముందు నుండే గీతు.. రేవంత్, అభినయల బేబీస్ దొంగిలించి స్టోర్ రూమ్ లో పెట్టింది. గత రాత్రి మిడ్ నైట్ అయినా పడుకోకుండా శ్రీహన్ ఇంకా కొందరి బేబీస్ దొంగతనము చేసేసింది.
తన బేబీ ని మాత్రం ఎవరికీ దొరక్కుండా స్టోర్ రూమ్ లో దాచేసింది. కానీ గలాటా గీతు చేసిన గలాటకి రేవంత్ రివెంజ్ తీర్చుకున్నాడు. గీతు బేబీ ని స్టోర్ రూమ్ నుండి తీసి ఈ బొమ్మ ఎవరిది అనగానే చంటి అది గీతు ది అన్నాడు. రేవంత్ ఆ బేబీ ని లోపల దాచేసి బయటికి వచ్చి గెంతుతూ దానిని ఓపెన్ ఏరియాలో పెట్టేసాడు. గీతు తర్వాత స్టోర్ రూమ్ లోకి వెళ్లి నా బొమ్మ ని దొంగిలించారు బిగ్ బాస్ అంటూ బయటికి వచ్చేసింది. శ్రీహన్ అయ్యో గీతు బేబీ కూడా వచ్చేసిందిగా అంటూ సంబరపడిపోగా.. ముందు నీ బొమ్మ దొబ్బేసా అంది గీతు. ఇక రేవంత్ తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలని తన్నేవాడు మరొకడుంటాడు అంటూ గీతూని ఉద్దేశించి హౌస్ మేట్స్ తో చెప్పిన ప్రోమో బయటికి వచ్చింది.
ఇక రెండో వారం కెప్టెన్సీ కంటెండర్ లిస్ట్ లో ఫైమా, చంటి, ఇనాయ, కీర్తి భట్, నేహా ఉండగా.. అందులో ఫైమాని రేవంత్ సంచాలక్ గా బయటికి పంపెయ్యడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకోగా.. రెండో వారం కెప్టెన్ గా ఇనాయ-కీర్తి భట్ మధ్యలో పోరు రసవత్తరంగా నడిచింది.