Advertisementt

సలార్ కొత్త షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడే..

Wed 14th Sep 2022 08:40 PM
salaar movie,rpabhas,prashanth neel  సలార్ కొత్త షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడే..
Salaar new schedule will start in October సలార్ కొత్త షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడే..
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం పెదనాన్న కృష్ణం రాజు మరణంతో కుంగిపోయి ఉన్నారు. ఆ ఫ్యామిలీకి అండగా ప్రభాస్ ప్రస్తుతం కృష్ణం రాజు గారి కర్మకాండలకి సంబందించిన పనులతో బిజీగా వున్నారు. ఆ దుఃఖం నుండి బయటికి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకే ఈ నెలలోనే ప్రశాంత్ నీల్ తో సలార్ కొత్త షెడ్యూల్ మొదలు కావాల్సి ఉన్నప్పటికీ.. అది అక్టోబర్ కి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఈ వారంలోనే సలార్ కొత్త షెడ్యూల్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం సలార్ షూటింగ్ కి బ్రేకిచ్చి గత వారం వరకు విదేశాల్లోనే ఉన్నారు.

అది పూర్తయ్యి ప్రభాస్ హైదరాబాద్ కి రాగానే కృష్ణ రాజుగారు పోవడంతో.. ఆయన చేస్తున్న సినిమాల షెడ్యూల్స్ అన్ని వాయిదా పడినాయి. సలార్ తో పాటుగా నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K కొత్త షెడ్యూల్ కూడా అక్టోబర్ లోనే మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ పూర్తి కావడంతో ఓం రౌత్ ప్రొడక్షన్ పనుల్లతో బిజీగా వున్నారు. ఇక ప్రశాంత్ నీల్ తో హై యాక్షన్ ఓల్టేజ్ తో సలార్ తెరకెక్కుతుంటే.. ప్రాజెక్ట్ K మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. ప్రభాస్, మారుతీ తో చెయ్యబోయే ఫిలిం నవంబర్ నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

Salaar new schedule will start in October:

Salaar movie shooting update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ