Advertisementt

బిగ్ బాస్ 6: పబ్లిక్ గా అది అవసరమా..

Wed 14th Sep 2022 06:04 PM
bigg boss 6,mareena,rohith  బిగ్ బాస్ 6: పబ్లిక్ గా అది అవసరమా..
Bigg Boss 6: Is romance necessary in public? బిగ్ బాస్ 6: పబ్లిక్ గా అది అవసరమా..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 మొదలైనప్పటి నుండి బుల్లితెర ప్రేక్షకులు కి ఏది కావాలో, బిగ్ బాస్ టీఆర్పీ పెంచేందుకు ఏది ఉపయోగపడుతుందో అదే హౌస్ లో కనబడుతుంది. అది నామినేషన్స్ రచ్చ మాత్రమే కాదు, మామూలుగానే గొడవలు పడుతూ ఇల్లంతా నానా యాగీ చేస్తున్నారు 21 మంది కంటెస్టెంట్స్. ఎవరికి వారే తోపులు అనిపించుకోవాలని తపన కనబడుతుంది. రేవంత్, గీతు, ఫైమా, అర్జున్, ఆది రెడ్డి ఇలా వీళ్లంతా టాస్క్ ల్లోనూ, మిగతా విషయాల్లో హైలెట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సీజన్ సిక్స్ లోకి మరీనా-రోహిత్ జంటగా అడుగుపెట్టారు. గతంలోనూ వరుణ్ సందేశ్-వితిక సెరులు వచ్చారు. కానీ వాళ్ళు షో అయ్యేవరకు పద్దతిగానే కనబడ్డారు.

కానీ మరీనా-రోహిత్ ల రొమాన్స్ ఎక్కువైంది హౌస్ లో. ఓపెన్ గానే ముద్దులు పెట్టేసుకుంటున్నారు. వాళ్ళకి పెళ్లయింది.. ముద్దులు, హగ్గులు ఇచ్చుకున్నా ఏం ప్రాబ్లెమ్ లేదు అంటూ నాగార్జున కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. పెళ్లయ్యింది ఓకె ఒప్పుకున్నాం. కానీ పబ్లిక్ గా ఓ ఓపెన్ ప్లాట్ ఫామ్ కి వచ్చాక ఇంత అతి చెయ్యడం అవసరమా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. రోహిత్ కాస్త పద్దతిగా కనిపించినా.. మరీనా అతని మీద పడిపోతుంది. ఈ షో అయ్యే వరకు కాస్త డిస్టెన్స్ మెయింటింగ్ చెయ్యండి.. మీ రొమాన్స్ చూడలేకపోతున్నాం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

Bigg Boss 6: Is romance necessary in public?:

Bigg Boss 6 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ