Advertisementt

బిగ్ బాస్: నాగార్జున vs నారాయణ

Wed 14th Sep 2022 02:53 PM
narayana,nagarjuna,bigg boss  బిగ్ బాస్: నాగార్జున vs నారాయణ
Bigg Boss: Nagarjuna vs Narayana బిగ్ బాస్: నాగార్జున vs నారాయణ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ విషయంలో సిపిఐ నారాయణ బిగ్ బాస్ యాజమాన్యం పై అలాగే దానికి హోస్ట్ చేస్తున్న నాగార్జున పై చిందులు తొక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ కి అడ్డా అంటుంటే.. కాదు దానికి అడ్డా అంటూ నారాయణ పచ్చిగా మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ ముద్దులకి, హగ్గులకి పబ్లిక్ అడ్డా అంటూ నారాయణ రెచ్చిపోతుంటే.. నాగార్జున నిన్నమొన్నటివరకు ఈ విషయంలో కామెంట్ చెయ్యకుండా కామ్ గానే ఉన్నారు. కానీ సీజన్ 6 మొదలైన వారం తర్వాత శనివారం ఎపిసోడ్ లో మరీనా-రోహిత్ జంటతో పబ్లిక్ గా హగ్ ఇప్పించి నారాయణ నారాయణ వాళ్ళకి పెళ్లయ్యింది, లైసెన్సు ఉంది అంటూ నాగార్జున నారాయణ చేస్తున్న కామెంట్స్ పై డైరెక్ట్ గానే పంచ్ వేశారు.

దానితో సిపిఐ నారాయణ రోజుకో ఛానల్ లో కూర్చుని బిగ్ బాస్ పై ఇంటర్వూస్ ఇస్తూ నాగార్జునని ఏకి పారేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జునని మీరు నారాయణ నారాయణ అంటూ నారాయణని ఉద్దేశించే అన్నారా అని అడిగితే.. లేదండి అది నా ఊత పదం. ఎవరైనా జోక్స్ వేస్తె నాకు నారాయణ, నారాయణ అనడం అలవాటు. బిగ్ బాస్ రెండు సీజన్స్ లోనూ ఇదే ఉంది. నేను ఎవరిని ఉద్దేశించి నారాయణ అనడం లేదు అంటూ నారాయణ.. నారాయణ అనే కామెంట్ పై నాగార్జున వివరణ ఇచ్చారు.

Bigg Boss: Nagarjuna vs Narayana:

CPI Narayana is criticising the Bigg Boss show and made comments against the show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ