సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ ని దేవుడు, దేవరా అంటూ తెగ పొగిడేస్తుంటాడు బండ్ల గణేష్, ఈమధ్యన బండ్ల గణేష్ అవసరమైన దానికి అనవసరమైన దానికి ట్వీట్ల రూపంలో స్పందిస్తున్నాడు. పనిగట్టుకుని పవన్ నామ జపం చేసే బండ్ల ని చూస్తుంటే పవన్ ఫాన్స్ కే చిరాకు తెప్పిస్తుంది. మొన్నామధ్యన పవన్ తో సినిమా ఎప్పుడు బండ్లన్నా అంటే.. పవన్ తో సినిమా చెయ్యను, ఆయన రాజకీయాల్లో బిజీగా వున్నారు. ఆయన్ని నేను విసిగించాను. అందుకే సినిమా చెయ్యను అంటూ చెప్పడం, అలాగే తల్లితండ్రుల తర్వాతే దేవుడు కూడా అంటూ చెప్పడం ఇలా ఎన్నో రకాలుగా పవన్ ఫాన్స్ ని విసిగిస్తూనే ఉన్నాడు. తాజాగా టాలీవుడ్ లో జరిగిన ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ హీరోలపై సెటైరికల్ కామెంట్స్ చేసాడు.
అది నిన్న మంగళవారం రాత్రి సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈవెంట్ కి గెస్ట్ లుగా నలుగురైదుగురు కుర్ర హీరోలు హాజరయ్యారు. ఎవరి జోనర్ లో వారు తోపే. అందులో అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ కాలు మీద కాలు వేసుకుని ఈవెంట్ ని ఎంజాయ్ చెయ్యగా.. ఆ పిక్ ని చిరు పక్కన పవన్ కళ్యాణ్ ఒద్దికగా కూర్చున్న పిక్ పోస్ట్ చేస్తూ.. నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర. దయచేసి నేర్చుకోండి. ఆచరించండి. అది మన ధర్మం అంటూ ట్వీట్ చేసాడు. అంటే శేష్, సిద్దు లు కాలు మీద కాలు వేసుకోడం కరెక్ట్ కాదు, వారికి అంత గర్వం ఏమిటి, పవన్ కళ్యాణ్ ని చూడండి ఎంత ఒద్దికగా అన్న ముందు కూర్చున్నారో అనేది బండ్ల ట్వీట్ కి అర్ధం. కానీ ఇది చూసిన పవన్ ఫాన్స్ సంతోషపడకపోగా.. నమస్కారానికి, సంస్కారానికి తేడా తెలియని నువ్వు పవన్ ని తెగ పొగిడేస్తున్నావ్, ముందు సంస్కారం నేర్చుకో అంటూ బండ్ల ని ఆడేసుకుంటున్నాడు.