బిగ్ బాస్ 6 లోకి ఎంతో హుందాగా, హుషారుగా అడుపెట్టిన సింగర్ రేవంత్.. ఇప్పుడు హౌస్ లో చేసే ఓవరేక్షన్ చూడలేకపోతున్నారు బుల్లితెర ప్రేక్షకులు. నిన్న మంగళవారం జరిగిన కెప్టెన్సీ పోటీలో రేవంత్ పెరఫార్మెన్స్ బావుంది. కాదు అని చెప్పలేం. కానీ ఫైమా తనని గెలవకుండా స్ట్రాటజీ ఉపయోగించడంతో చాలా ప్రస్టేట్ అయ్యాడు. తర్వాత గీతు రేవంత్ బేబీ ని వదులుకునేలా చెయ్యడంతో మరింతగా బాధపడిపోయాడు. అసలు రేవంత్ ఏమిటి.. ఈ ఓవరేక్షన్ ఏమిటి అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడితే ఎమోషన్ అయ్యి కంట తడి పెట్టేస్తున్నాడు.
మరోపక్క గలాటా గీతు అతి చూడలేకపోయారు బుల్లితెర అభిమానులు. తాను అభినయ బొమ్మ కొట్టేసి బిగ్ బాస్ కి చూపిస్తే.. నేను నా బొమ్మని వదల్లేదు, దాని పక్కనే ఉన్నాను. కానీ గీతు తీసుకెళ్ళిపోయింది అని అభినయ కెప్టెన్ బాలాదిత్యకి కంప్లైంట్ చెయ్యగా.. బాలాదిత్య ఆ బొమ్మని అభినయకి ఇప్పించాడు. కానీ బిగ్ బాస్ దానిని తీసుకుని స్టోర్ రూమ్ లో పెట్టమని గీతు కి చెప్పగా.. గీతు దానిని తీసుకుని వెళ్లి స్టోర్ రూమ్ లో నేనే గెలిచాను అంటూ డాన్స్ చెయ్యడం, బిగ్ బాస్ నీకు ముద్దు పెడతా అంటూ కెమెరాలకు ముద్దు పెట్టడం, ఆ తర్వాత కెమెరాలతో మట్లాడడం, అర్ధరాత్రి కొంతమంది బేబీస్ ని దొంగిలించడం అన్ని ఆమె చేసిన అతిలో భాగమే అంటూ.. ఆమెని ఎలిమినేట్ చెయ్యండి బిగ్ బాస్ అని కొంతమంది అంటుంటే.. ఆమె ఆలా చెయ్యబట్టే కదా ఇప్పుడు అందరూ గీతు గురించి మాట్లాడుతున్నారు.. లేదంటే ఇతర కంటెస్టెంట్స్ లాగే.. ఎవరి గురించి మట్లాడరు, అలా ఆమె అందరి నోళ్ళలో నానుతూ క్రేజ్ తెచ్చుకుంటుంది అంటున్నారు.