రాజమౌళి తన నెక్స్ట్ ఫిలిం మహేష్ బాబు తో చెయ్యబోతున్నట్టుగా టొరంటో ఫిలిం ఫెస్టివల్ కోసం వెళ్లి అక్కడ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఒక్కసారిగా రాజమౌళి-మహేష్ బాబు సినిమా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అయితే మహేష్ తో చెయ్యబోయే సినిమా నేపథ్యం ఎలా ఉండబోతుందో కూడా రాజమౌళి అక్కడ వరల్డ్ వైడ్ గా చూసే ఇంటర్వ్యూలో చెప్పడం అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసింది. అది కూడా గ్లోబల్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో మహేష్ తో మూవీ చేస్తున్నట్టుగా చెప్పడంతో.. అందరూ రాజమౌళి సారూ అసలు గ్లోబల్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అంటే ఏమిటి.. అది అందరికి అర్ధమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.
యాక్షన్ అడ్వెంచర్ అంటే అందరికి తెలుసు. కానీ గ్లోబల్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అంటేనే బొత్తిగా అర్ధం కావడం లేదు అంటున్నారు. గ్లోబల్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అంటే ప్రపంచం చుట్టూ తిరగే ఓ యాక్షన్ అని అర్థం. ఇంకొక్కటి ప్రపంచాన్ని చుట్టి రావడం. అంటే ఈ లెక్కన మహేష్-రాజమౌళి సినిమా ప్రపంచంలోని చాలా ప్రాంతాలను కనెక్ట్ చేసే యాక్షన్ అడ్వెంచర్ అని అర్ధమేమో అంటున్నారు. అయితే వరల్డ్ వైడ్ గా అడ్వెంచర్ ఫిలిం అంటే పాన్ ఇండియా రేంజ్ కాదు, ఈసారి రాజమౌళి వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ రేంజ్ నే టార్గెట్ చేసారు. మహేష్ ముందుగా పాన్ ఇండియాలో కాకుండా హాలీవుడ్ రేంజ్ లోకి అడుగుపెడతారు ఈ రాజమౌళి సినిమాతో అంటూ మహేష్ ఫాన్స్ ఉత్సాహ పడిపోతున్నారు..