ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళన రోజు రోజుకి ఎక్కువైపోతోంది. కారణం ఎన్టీఆర్ తదుపరి చిత్రం విషయంలో ఇంకా ఇంకా ఆలోచిస్తున్నారని. తన తోటి హీరోలు సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నారు. మూడు నెలల గ్యాప్ తో మహేష్ బాబు కొత్త చిత్రం స్టార్ట్ చేసేసారు. అటు చూస్తే అల్లు అర్జున్ పుష్ప ద రూల్ పూజ చేసి రెగ్యులర్ షూట్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. మరోపక్క రామ్ చరణ్ RC15 తో దూకుమీదున్నాడు. ప్రభాస్ చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలా మిగతా హీరోలు దూసుకుపోతుంటే.. ఎన్టీఆర్ ఇంకా ఇంట్లోనే ఉండడంపై ఫాన్స్ లో ఆందోళన మరింతగా పెరిగిపోతుంది.
కొరటాల తో ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళతారా అని ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఏమో NTR30 కోసం వెయిట్ లాస్ పనిలో ఉన్నారు. అప్పుడప్పుడు ఆయన కొత్త లుక్ తెలుస్తూనే ఉంది. అయినా ఫాన్స్ లో భయం పోవడం లేదు. దాదాపు ఏడాదిన్నరగా ఎన్టీఆర్ ఖాళీగానే ఉన్నారు. మధ్యలో రెండు నెలలు ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం వాడినా.. మిగతా టైం మొత్తం వేస్ట్. అదే ఫాన్స్ బాధ. మే 20 ఆయన బర్త్ డే రోజున NTR30 నుండి స్పెషల్ వీడియో, NTR31 నుండి స్పెషల్ లుక్ బయటికి వచ్చాయి. కానీ అఫీషియల్ గా పట్టాలెక్కకపోవడం పై ఫాన్స్ గుర్రుగాను ఉన్నారు. అందుకే ఎన్టీఆరూ కాస్త ఆలోచించవయ్యా అని రిక్వెస్ట్ చేసుకున్నారు.