అక్టోబర్ 5 న రిలీజ్ డేట్ ప్రకటించిన నాగార్జున ద ఘోస్ట్ మూవీ ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేసుకుంది. ఆ ప్లాన్ లో భాగంగా అక్టోబర్ 5 న అనుకున్న ఘోస్ట్ ఆ డేట్ కి రావడం లేదు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ తో బాక్సాఫీసు పోటీకి దిగడం ఎందుకు రెండు రోజులు వెనక్కి వెళితే పోయేదేం లేదు అని.. ఘోస్ట్ మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఏ క్షణమైనా ఘోస్ట్ మేకర్స్ నుండి అక్టోబర్5 నుండి పోస్ట్ పోన్ అయ్యి అక్టోబర్ 7 కి రిలీజ్ డేట్ మారింది అనే వార్త చూస్తారంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగానే జరిగింది. మెగాస్టార్ చిరు-కింగ్ నాగార్జున ఫ్రెండ్స్. సో ఒకే రోజు అది కూడా పండగ పూట బాక్సాఫీస్ ఫైట్ పెట్టుకోవడం అవసరమా అంటూ ఆలోచనలో ఉన్నారని అన్నారు.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ద ఘోస్ట్ మూవీని అక్టోబర్ 5 నే రిలీజ్ చెయ్యాలని, అందుకు తగ్గ ఏర్పాట్లతో పాటుగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పటికే ఘోస్ట్ కి సంబందించి వదిలిన పోస్టర్స్, గ్లిమ్ప్స్ అందరిని ఆకట్టుకోగా.. త్వరలోనే ఘోస్ట్ ట్రైలర్ రిలీజ్ కి చిత్ర బృందం ప్రిపేర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగ్ సరసన సోనాల్ చౌహన్ నటిస్తుంది.