పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణంతో ప్రభాస్ మోహంలో బాధ కనిపించింది. కనిపించకుండా కన్నీళ్లు పెట్టుకున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చూసిన ప్రభాస్ ఫాన్స్ ఆయన్ని ఓదార్చే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా చేసారు. అన్నా మీకు మేమున్నాం. మీరు కన్నీళ్లు పెట్టకండి అంటూ ప్రభాస్ ని ఓదార్చే ప్రయత్నం చేసారు. ఇప్పుడు అంత కష్టం లోను ప్రభాస్ ఫాన్స్ కి ఓ గుడ్ న్యూస్ వినిపించింది. అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అరుదైన ఆహ్వానం అందింది.
ఢిల్లీలో దసరా పర్వదినాన రామ్ లీలా మైదానంలో జరిగే రావణదహనం కార్యక్రమానికి హాజరు కావాలని రామ్ లీలా కమిటీ సభ్యులు ప్రభాస్ కి ఆహ్వానం పంపించారు. దసరా ఉత్సవాలకు ప్రభాస్‌ను గెస్ట్ గా హాజరుకావాలని వారు కోరినట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో కలిసి ఆదిపురుష్ చేస్తున్నారు. ఆ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆదిపురుష్ లో ప్రభాస్ మోడరన్ రామగా కనిపించనున్నారు. ఇప్పుడు ఆదిపురుష్ లోని ప్రభాస్ లుక్ కోసం తెగ వైట్ చేస్తున్న ఫాన్స్ కి ప్రభాస్ కి రామ్ లీలా మైదానంలో రావణదహనం కార్యక్రమానికి ఆహ్వానం రావడం చెప్పలేనంత సంతోషాన్నిచ్చింది. అయితే ఆ కార్యక్రమానికి ప్రభాస్ హాజరవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.