ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా నమ్రతగా మాట్లాడతారు కాబట్టే వారు హిందీ ప్రేక్షకులకి నచ్చారు.. అంటూ RGV సంచలనంగా మాట్లాడారు. అసలు బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ మరణం తర్వాతే.. అక్కడ బాయ్ కాట్ బాలీవుడ్, బాయ్ కాట్ హాష్ టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్ లాంటి వాళ్ళని చూసాక ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ ల మాటతీరు వాళ్ళకి నచ్చడంతోనే ట్రిపుల్ ఆర్ విషయంలో నార్త్ ప్రేక్షేకులు ఎటువంటి నెగిటివిటీ చూపించలేదు. కానీ విజయ్ దేవరకొండ లైగర్ విషయానికొచ్చేసరికి.. అది ఎక్కువ నెగిటివ్ అవ్వడానికి కారణం కరణ్ జోహార్. మరి విజయ్ దేవరకొండపై కూడా లెక్కలేనంత నెగిటివి వచ్చింది కదా అన్న యాంకర్ ప్రశ్నకి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..
విజయ్ దేవరకొండ ముందు నుండి అంటే అర్జున్ రెడ్డి దగ్గర నుండే అగ్రెస్సివ్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొత్తగా అతనేం మాట్లాడలేదు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ లైగర్ సినిమాతో రాత్రికి రాత్రే రాలేదు. తన అర్జున్ రెడ్డి సినిమాకు ముందే అలాంటి యాటిట్యూడ్ ఉంది. అందుకే విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాడు. కానీ లైగర్ సినిమా సమయంలో అతనికి బ్యాడ్ టైమ్ వచ్చింది. అతను మాట తీరుతో హిందీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాడు. ఒక హీరో ఎదుగుతున్నాడంటే.. చాలా మంది హీరోలకు జెలసి ఉంటుంది. అంతేకాకుండా ఎదిగిపోయే హీరోను తొక్కేయడం ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉంది. అది సినిమా వాళ్ళ నైజం. ఒక హీరో అంటే.. మరో హీరోకు పడటకపోవడం మానవ సహజం. ఇంకా లైగర్ పోవడానికి పూరి పై బండ్ల చేసిన వ్యాఖ్యలతో పాటుగా సవాలక్ష కారణాలు ఉన్నాయి. కేవలం విజయ్ వల్లే ఆ సినిమా పోలేదు.. అంటూ రామ్ గోపాల్ వర్మ విజయ్ యాటిట్యూడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.