రేపు రాబోయే దసరా ఫెస్టివల్ కి మెగాస్టార్ చిరంజీవి-కింగ్ నాగార్జున బాక్సాఫీసు దగ్గర పోటీ పడబోతున్నారు. మెగాస్టార్ గాడ్ ఫాదర్ గాను, నాగ్ ఘోస్ట్ గాను ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అక్టోబర్ 5 విజయ దశమి రోజున ఈ పోరుకు వీరిద్దరూ సిద్ధమయ్యారు. ఇప్పటికే గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ మొదలైపోయాయి. సినిమాలోని కీలక పాత్రల లుక్స్ ని వరసగా రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఈరోజు చిరు-బాలీవుడ్ స్టార్ సల్మాన్ సాంగ్ ప్రోమో రిలీజ్ కాబోతుంది. ఇంతిలా గాడ్ ఫాదర్ టీం హడావిడి చేస్తుంటే.. నాగార్జున ఘోస్ట్ టీం సైలెంట్ గా ఉంది.
అయితే చిరంజీవి తో ఫైట్ ఎందుకులే.. కొద్దిగా వెనక్కి వెళదామని ఆలోచనలో ఘోస్ట్ టీం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే అక్టోబర్ 7 న ఘోస్ట్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని, త్వరలో ఈ కొత్త రిలీజ్ డేట్ పై అఫీషియల్ ప్రకటన రావొచ్చని అంటున్నారు. నాగ్-చిరు ఫ్రెండ్స్. సో ఒకరికోరు పోటీ పడడం అవసరమా.. అనే ఉద్దేశ్యంతోనే ఘోస్ట్ డేట్ ని వెనక్కి జరిపినట్టుగా తెలుస్తుంది.