విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా దాని ఈకలు పీకడం మొదలు పెడుతున్నారు నెటిజెన్స్. ఇక్కడ నెటిజెన్స్ తప్పు కూడా లేదు. విజయ్ చేసే ట్వీట్స్ ఆయన మాట్లాడే మాటలు అలానే ఉంటాయి. నన్నేం పీకలేరు. నేనో సింగిల్ ప్లేయర్, నా తాత, తండ్రి తెల్వకపోయినా నన్ను తెగ అదిరిస్తున్నారు అంటూ కెలుక్కుంటూ ఉంటాడు. లైగర్ రిజల్ట్ తర్వాత అయినా విజయ్ ఎక్కడైనా తగ్గుతాడు అనుకుంటే.. నెవ్వర్ నేను తగ్గేదే లే అంటున్నాడు. రీసెంట్ గా బెంగుళూర్ లో జరిగిన SIIMA అవార్డ్స్ కి గెస్ట్ గా హాజరయ్యాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. చాలా స్టైలిష్ గా అందరి చూపు తనమీదే ఉండేలా చూసుకున్నాడు. అది బాగా వర్కౌట్ అయ్యింది.
ఆ తర్వాతి రోజే కృష్ణ రాజు గారి పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన విజయ్ దేవరకొండ నిన్న సోమవారం సోషల్ మీడియాలో SIIMA అవార్డ్స్ కి హాజరైన అవుట్ ఫిట్ ని షేర్ చేస్తూ సింగిల్ ప్లేయర్ అంటూ ట్వీట్ చేసాడు. దానితో నెటిజెన్స్ రంగం లోకి దిగిపోయారు. సింగిల్ ప్లేయర్ అంటే అర్థమేంటని విజయ్ ని ప్రశ్నిస్తున్నారు. అంటే నాకు ఎవరూ లేరు.. నేను సింగిల్ గానే ఫైట్ చేస్తున్నా అని దానర్ధమా అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక విజయ్ షేర్ చేసిన ఫొటో కంటే.. ఆయన పెట్టిన క్యాప్షన్‌పైనే ఎక్కువగా నెట్టింట చర్చ జరుగుతోంది. ఎవరిని ఉద్దేశించి విజయ్ ఈ పోస్ట్ పెట్టాడో అని అభిమానులు కూడా అనుమాన పడిపోతున్నారు.