రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి విషయాన్ని టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి రెబల్ అనే సినిమా చేసిన రాఘవ లారెన్స్ తాజాగా కృష్ణంరాజు మృతి నేపథ్యంలో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాను కృష్ణంరాజు గారిని మిస్ అవుతున్నానని ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని తన పిల్లలలాగే చాలా కేర్ తీసుకుంటారని అన్నారు.
ఒక తల్లి పిల్లలకు ఎలా అయితే ఆలనా పాలనా చూస్తుందో ఆయన కూడా సెట్లో ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అనే విషయాన్ని చూస్తూ ఉంటారని, తినని వారికి తల్లి లాగే కొసరి కొసరి తినిపిస్తారని చెప్పుకొచ్చారు. తాను ఆ ప్రేమను, కేర్ ని మిస్ అవుతున్నానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం తన దురదృష్టం అని అందుకే ఆయనను కడసారి చూసుకోలేకపోయాను అని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఆయన లెగసీ ప్రభాస్ గారి ద్వారా కొనసాగుతుందని తాను ఆశిస్తున్నట్లు రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు.