Advertisementt

బిగ్ బాస్ 6: ఆమెని ఎలిమినేట్ చేసెయ్యండి

Tue 13th Sep 2022 11:45 AM
big boss telugu 6,geetu,big boss  బిగ్ బాస్ 6: ఆమెని ఎలిమినేట్ చేసెయ్యండి
Big Boss 6 Viewers Want Geetu To Get Eliminated బిగ్ బాస్ 6: ఆమెని ఎలిమినేట్ చేసెయ్యండి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 మొదలైనప్పటినుండి ఎవరో ఒకరి మీద విరుచుకు పడుతూ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడెయ్యడం, ఎదుటి వారు హార్ట్ అవుతున్నారా.. లేదో.. అనే విషయాన్ని పట్టించుకోని గలాటా గీతూ అంటే హౌస్ మేట్స్ కే కాదు, బుల్లితెర ప్రేక్షకులకి చిరాగ్గానే ఉంది. తాను ఎవరైనా చెత్త సరిగ్గా డస్ట్ బిన్ లో పడెయ్యకపోయినా, వాష్ రూమ్ లో హెయిర్ చూసినా ఎగిరి గంతులు వేస్తుంది. కానీ ఆమె మాత్రం టిష్యుస్ డస్ట్ బిన్ లో వెయ్యదు. ఈ విషయం నాగార్జునే చెప్పారు. ఇక గేమ్ లో గెలవడానికి ఎంతకైనా తెగిస్తాను అంటూ మాట్లాడిన మాటలు హౌస్ మేట్స్ కి ఏ మాత్రం నచ్చలేదు. 

దానితో ఈ వారం ఈమెని చాలామంది నామినేట్ చేసారు. నేహా చౌదరి, రేవంత్, చంటి, రాజశేఖర్, సూర్య, శ్రీహన్ ఇలా చాలామంది ఆమెని నామినేషన్స్ లోకి పంపించారు. చంటి, రేవంత్ తో గట్టిగానే గీతూ వాదన పెట్టుకుంది. ఇక నేహా చౌదరితో అయితే నేను గట్టిగా మాట్లాడుతున్నా అనుకుంటే నాతో మాట్లాడొద్దు అని గొడవేసుకుంది. తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి చాలా ట్రై చేసింది. ఇక నామినేషన్స్ అయ్యాక కూడా గీతూ ఆది రెడ్డి తో మీటింగ్ పెట్టింది. ఆమె బిహేవియర్ చూస్తుంటే.. గీతూ ని హౌస్ లో కొనసాగించడం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయం పడుతుంటే.. ఇలా ఉంటేనే గీతూ హౌస్ లో చివరి వరకు కొనసాగుతుంది అంటున్నారు.

Big Boss 6 Viewers Want Geetu To Get Eliminated :

Big Boss Telugu 6 Viewers Want Geetu To Get Eliminated In the Second Week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ