ఎన్నో ఆశలతో, ఎంతో నమ్మకంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఇండియా వైడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన లైగర్ మూవీ పూరి బ్యాచ్ కి భారీ షాకిచ్చింది. పూరి-ఛార్మి-కరణ్ కలయికలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ విడుదలకు ముందు ఎంత క్రేజ్ ఉందో.. విడుదలయ్యాక అంతే నెగిటివిటీని మూటగట్టుకుంది. బాయ్ కాట్ లైగర్ హాష్ టాగ్ ట్రెండ్ చేసినట్టుగానే సినిమాని నెటిజెన్స్ బాయ్ కాట్ చేసేసారు. సౌత్ లో కన్నా బాలీవుడ్ లో కాస్త పర్వాలేదనిపించింది. లైగర్ ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ దేశ వ్యాప్తంగా నష్టపోయారు. విజయ్ దేవరకొండ ప్రమోషన్స్, సినిమాపై వస్తున్న పాజిటివ్ థింకింగ్ అన్నిటిని కలిపి బయ్యర్లు భారీగా ధర చెల్లించి లైగర్ హక్కులని కొనుక్కున్నారు.
కానీ డిస్ట్రిబ్యూటర్స్ కి లైగర్ వలన భారీ లాస్ వచ్చేసింది. దానితో పూరి-ఛార్మి ని కలిసి లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ తమ కి వచ్చిన నష్టాన్ని పూడ్చాలని డిమాండ్ చెయ్యాలని, ఎంతో కొంత నష్టాలూ పూడ్చమని అడగడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ లైగర్ తో మీకన్నా మేమె ఎక్కువ నష్టపోయాం.. మేము ఏమి చేయలేమంటూ ఛార్మి చేతులెత్తేస్తుందట. పూరి మాత్రం అది కూడా చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయినట్లుగా తెలుస్తుంది. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కనీసం ఛార్మీతో మాట్లాడేందుకు కూడా లైన్ దొరకడం లేదట. దానితో వారికి కాలి ఈ ఇష్యూని ఫిల్మ్ ఛాంబర్ వద్దకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ఎక్కడా న్యాయం జరక్కపోతే.. పూరి-ఛార్మి నుండి వచ్చే నెక్స్ట్ సినిమా విషయంలో ఇబ్బందులు పెట్టడానికి రెడీ అంటున్నారట వారు.