Advertisementt

సడెన్‌గా ఇంత ప్రేమేంటి వర్మా..?

Thu 22nd Sep 2022 09:14 AM
ram gopal varma,rgv,varma,tollywood heroes,krishnam raju,sridevi,tweet  సడెన్‌గా ఇంత ప్రేమేంటి వర్మా..?
Ram Gopal Varma tweet on Tollywood Heroes సడెన్‌గా ఇంత ప్రేమేంటి వర్మా..?
Advertisement
Ads by CJ

స్ట్రయిట్‌గా పాయింట్‌లోకి వద్దాం.. రామ్ గోపాల్‌ వర్మకి ఆరాధ్య దైవం ‘శ్రీదేవి’. ఆమె చనిపోయినప్పుడే.. ఏం మాట్లాడని వర్మ.. ఇప్పుడు సడెన్‌గా కృష్ణంరాజు చనిపోవడంతో షూటింగ్స్ ఆపేయమని ట్విట్టర్ వేదికగా సలహాలు.. కాదు కాదు హెచ్చరికలు ఇస్తున్నాడు. బహుశా.. శ్రీదేవి చనిపోయినప్పుడు వర్మ కోమాలోకి వెళ్లిపోయి ఉంటాడేమో! అందుకే అప్పుడు ఎలాంటి సూచనలు, హెచ్చరికలు ఇవ్వలేకపోయి ఉంటాడు? కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఆధిపత్యపోరుని ఇంకాస్త రగిలించడానికి అన్నట్లుగా.. వర్మ చేసిన ట్వీట్స్ ఉన్నాయనేది ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్న మాట. ఈ ట్వీట్స్ తర్వాత.. అందరూ అంటే ఇండస్ట్రీ వర్గాలు, నెటిజన్లు మాట్లాడుకుంటున్నది ఏమిటంటే.. ఇండస్ట్రీ పెద్దగా వర్మ దిశా నిర్దేశం చేయాలని తాపత్రయ పడుతున్నాడని. లేదంటే, ఇండస్ట్రీకి మంచి, చెడు చెప్పే పెద్దరికం లేదని చెప్పడమే తన ఉద్దేశం అనేలా టాక్ నడుస్తుంది. లేకపోతే.. సడెన్‌గా వర్మకి ఇంత ప్రేమెందుకు పుట్టుకొచ్చి ఉంటుంది.

 

ఎందుకంటే.. చావు, బతుకులను పట్టించుకోని వర్మ, అమ్మాయిల అందమే ప్రప్రంచం అని భావించే వర్మ.. వోడ్కాతోటే సర్వసుఖాలు అని అందులో మునిగిపోయే వర్మ.. సడెన్‌గా ఇలా హితోపదేశం ఇచ్చే సరికి.. ముందు ఈ షాక్‌లో నుండి కొందరు బయటికి రాలేక పోతున్నారు. ఇంకొందరైతే.. మీరు మారిపోయార్ సార్ అంటూ సెల్యూట్ చేస్తున్నారు. కానీ వర్మ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే.. షూటింగ్స్ ఆపేసి సంతాపం తెలపమని ఏ నటికానీ, నటుడు కానీ కోరుకోడు. ఎందుకంటే.. ఇన్నాళ్లూ ఆ నటుడు లేదంటే నటి అదే పని చేస్తూ.. పైకి వచ్చారు కాబట్టి. అందుకే, ఎవరూ షూటింగ్స్ ఆపలేదు. షూటింగ్స్ చేస్తూనే ఒక నటుడికి చివరి క్షణంలో ఎలాంటి నివాళి ఇవ్వాలో.. అలానే మన స్టార్స్ ఇచ్చారని ఇండస్ట్రీ భావిస్తోంది. కాబట్టి.. వర్మ ట్వీట్స్‌ని పట్టుకుని ఇండస్ట్రీ పిసికేసుకోవాల్సిన అవసరమైతే లేదు. ఏమంటావ్ వర్మా?

Ram Gopal Varma tweet on Tollywood Heroes :

Ram Gopal Varma Tweet Creates Sensation in Tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ