బిగ్ బాస్ సీజన్ 6 రెండో వారంలోకి ప్రవేశించింది. మొదటి వారం చాలామందే నామినేషన్స్ లో ఉన్నప్పటికీ.. ఈ వారం ఎవరూ ఎలిమినేట్ అవ్వకుండా బ్రతికిపోయారు. లేదంటే ఆరోహి, ఇనాయ, అభినయ, చంటి, ఫైమా, రేవంత్, సుధీప, శ్రీ సత్య లలో ఎవరో ఒకరు బయటికి వెళ్లిపోయేవారే. ఇక రెండో వారం నామినేషన్స్ రచ్చ హౌస్ లో మాములుగా జరగలేదు. బిగ్ బాస్ సీజన్ 6 రెండో వారంలో చాలామంది గలాటా గీతూ నే టార్గెట్ చేసారు. అయినా ఆమె డిఫెండ్ చేసుకోవడానికి చాలా ట్రై చేసింది. శ్రీహన్, రేవంత్, నేహా చౌదరి, ఇంకా సూర్య ఇలా చాలామంది గీతూ నే నామినేట్ చేసారు. తనని నామినేట్ చేసిన వాళ్లతో గీతూ గొడవ కూడా పడింది.
రేవంత్ కి కీర్తి కి మధ్యన గొడవ జరిగినట్టుగా, అలాగే ఆదిరెడ్డి అయితే ఈ పదిహేను వారాలు నన్ను నామినేట్ చేసుకోండి అంటూ కలర్ ఎగరేసాడు. ఆరోహి తో ఆదిరెడ్డి నేను ఆడుతున్నా నీకు కనిపించలేదు, అయినా నీతో రేపో లేని కారణంగా నన్ను నామినేట్ చేసావ్ చూస్తా అన్నది ఈ రోజు ప్రోమో చూపించారు. ఇక ఈ వారం దాదాపుగా 8 మంది నామినేషన్స్ లోకి వెళ్ళినట్టుగా బిగ్ బాస్ లీకులు బయటికి వచ్చేసాయి. లీకుల ప్రకారం ఈ వారం నామినేషన్స్ లోకి వారిలో రేవంత్, ఫైమా, అభినయశ్రీ, ఆదిరెడ్డి, గీతూ రాయల్, రాజశేఖర్, షానీ సాల్మన్, రోహిత్ అండ్ మెరీనాజంట ఉన్నారు. మరి ఫైమా, రేవంత్, అభినయాలు వరసగా రెండో వారం కూడా నామినేట్ అవ్వడం వాళ్ళ బాడ్ లక్ అనే చెప్పాలి.