Advertisementt

SSMB28: ఫస్ట్ గ్లిమ్ప్స్ తోనే అంచనాలు పెంచేశారు

Mon 12th Sep 2022 07:43 PM
ssmb28,mahesh babu,director trivikram  SSMB28: ఫస్ట్ గ్లిమ్ప్స్ తోనే అంచనాలు పెంచేశారు
SSMB28 first-day glimpse unveiled SSMB28: ఫస్ట్ గ్లిమ్ప్స్ తోనే అంచనాలు పెంచేశారు
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబో కోసం మహేష్ ఫాన్స్ గత కొన్నేళ్లుగా(దాదాపు 12 ఏళ్లుగా) వెయిట్ చేస్తున్నారు. అతడు, ఖలేజా లాంటి సినిమా ఒకటి మహేష్ కి పడాలని, అంతటి అద్భుతమైన కామెడీ మహేష్ కేరెక్టర్ కి పెట్టాలని, మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కి త్రివిక్రమ్ డైలాగ్స్ కలిస్తే ఓ రేంజ్ లో సినిమా ఉంటుంది అంటూ మహేష్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి మహేష్ ఫాన్స్ ఈ కాంబో కోసం గత మూడు నెలలుగా వెయిట్ చేస్తున్న SSMB28 రెగ్యులర్ షూట్ ఈ రోజే మొదలయ్యింది. ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుందో ఆయన వైఫ్ నమృత ఓ పిక్ ని షేర్ చేస్తూ రివీల్ చెయ్యగా.. మహేష్ కొత్త లుక్ కి ఫాన్స్ ఇంప్రెస్స్ అవుతున్నారు.

అయితే త్రివిక్రమ్ మహేష్ కి సీన్ వివరిస్తూ ఉన్న SSMB28 ఆన్ లొకేషన్ పిక్ ని వదులుతూ టీం ఈ రోజే రెగ్యులర్ షూట్ మొదలైనట్టుగా అప్ డేట్ ఇచ్చారు. ఆ సాయంత్రానికే SSMB28 ఫస్ట్ షాట్ తో FILIMING BEGINS అంటూ అదిరిపోయేలాంటి గ్లిమ్ప్స్ ఇంకొకటి వదిలింది చిత్ర బృందం. మహేష్ పూర్తి ఫేస్ కనబడకుండానే.. బ్యాక్ తోనే మేనేజ్ చేసినా.. మహేష్ అదిరిపోయాడు. త్రివిక్రమ్, చినబాబు ఫస్ట్ డే షూటింగ్ లో హడావిడిగా కనిపించినా.. లాస్ట్ షాట్ లో మహేష్ బాబు కళ్ళతోనే రౌద్రాన్ని చూపిస్తున్న మాస్ షాట్ ఫాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. ఆ ఫస్ట్ షాట్ పిక్ చూసిన మహేష్ ఫాన్స్ అస్సలాగడం లేదు. ఆ పిక్ ని, గ్లిమ్ప్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇక నేడు రెగ్యులర్ షూట్ తో మొదలైన ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023 న రిలీజ్ కాబోతున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.

SSMB28 first-day glimpse unveiled:

SSMB28: Superstar Mahesh Babu and director Trivikram much-awaited collaboration

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ