Advertisementt

ముగిసిన కృష్ణం రాజు అంత్యక్రియలు

Mon 12th Sep 2022 04:22 PM
prabhas,prabodh,krishnam raju  ముగిసిన కృష్ణం రాజు అంత్యక్రియలు
Prabhas Brother Prabodh To Perfrom Krishnam Raju Final Rites ముగిసిన కృష్ణం రాజు అంత్యక్రియలు
Advertisement
Ads by CJ

నిన్న ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించిన కృష్ణం రాజుకి కడసారి వీడ్కోలు పలికేందుకు విశేష అభిమాన గణం ఆయన నివాసానికి పోటెత్తారు. ఈ రోజు సోమవారం మధ్యాన్నం ఆయన అంత్యక్రియలు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరుగుతున్నాయని తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మధ్యాన్నం 1 గంటకి జూబ్లీహిల్స్ లోని కృష్ణం రాజు గారి నివాసం నుండి అంతిమ యాత్ర ప్రారంభమై గచ్చిబౌలి ORR మీదుగా అప్ప జంక్షన్ మీదుగా చేవెళ్ల నుండి మొయినాబాద్ దగ్గర లోని కనకమామిడి ఫామ్ హౌస్ కి చేరుకోగా.. అక్కడ ఆయన కూతుర్లు భార్య తో సాంప్రదాయపద్ధతిగా పూజలు చేయించిన తర్వాత ప్రభాస్ సోదరుడు ప్రబోద్ రాజు చేతుల మీదుగా కృష్ణ రాజు గారికి తలకొరివి పెట్టించారు.

ప్రభుత్వం తరపు నుండి మాగంటి గోపినాథ్, ఏపీ మంత్రులు, బిజెపి నుండి ఈటెల రాజేందర్, సినీ ప్రముఖులు మోహన్ బాబు, జగపతి బాబు, యాంకర్ ఉదయభాను లు హాజరవగా.. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణం రాజుని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభాస్ ప్రేమగా పిలుచుకునే కన్నమ్మ కృష్ణం రాజుగారి సతీమణి శ్యామలాదేవికి, ఆమె కూతుర్లకు ధైర్యం చెబుతూ ఉన్నారు. ఇక అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖుల మధ్యన కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణం రాజుగారి అంత్యక్రియలు కనకమామిడి ఫామ్ హౌస్ లో ముగిసాయి.

Prabhas Brother Prabodh To Perfrom Krishnam Raju Final Rites:

Prabhas brother Prabodh who will perform the last rites of Krishnam Raju

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ