రామ్ చరణ్ RC15 షూటింగ్ నుండి చిన్న బ్రేక్ దొరకడంతో ఆయన చెల్లెళ్ళతో, ఫ్రెండ్స్ తో కలిసి చిన్నపాటి ట్రిప్ కి వెళ్లారు. గత శనివారం ఉదయం సిస్టర్స్, మేనకోడళ్లు, ఫ్రెండ్స్ తో స్పెషల్ ఫ్లైట్ లో వెళుతున్న పిక్స్ ని రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే అప్పుడు చరణ్ ఎక్కడికి వెళుతున్నారో అనేది తెలియదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చరణ్ తన చెల్లెళ్ళు శ్రీజ, సుప్రియ తో కలిసి లంచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. @AlwaysRamCharan's quick vacay trip with siblings @sushkonidela & #Srija via Instagram. ❤️ 🤩 అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసారు.
ఊటీ లో రామ్ చరణ్ తన సిస్టర్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్ చూసిన మెగా ఫాన్స్ సంతోష పడిపోతున్నారు. ఇక రామ్ చరణ్ అక్కడి నుండి త్వరగానే హైదరాబాద్ కి వచ్చి RC15 తదుపరి షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా పవర్ ఫుల్ నటుడు SJ సూర్య ఈ మధ్యనే సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చరణ్ కి సూర్య కి మధ్యన యాక్షన్ సన్నివేశాలను శంకర్ కొత్త షెడ్యూల్ లో చిత్రీకరిస్తారని తెలుస్తుంది.