టాలీవుడ్ లెజెండ్ కృష్ణరాజు గారిని కోల్పోవడం సినీ పరిశ్రమకి తీరని లోటు అంటూ సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణ రాజు గారు పార్థివ దేహానికి నివాళు అర్పిస్తూ ఆయనని గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి మోహన్ బాబు, మహేష్, పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా స్టార్స్, చిన్న నటులు కృష్ణ రాజు గారిని చూసేందుకు, ఆయనకి నివాళుల అర్పించేందుకు వచ్చారు. బాలకృష్ణ టర్కీ లో NBK107 షూటింగ్ లో ఉండడంతో టీం అందరూ అక్కడినుండే ఆయనకి సంతాపం తెలియజేసిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. అయితే రామ్ గోపాల్ వర్మ కృష్ణ రాజు గారు మృతి కి సంతాపం తెలపడమే కాదు, పనిలో పనిగా సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలపై సంచలంగా ట్వీట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. కృష్ణ రాజు గారి మృతికి సంతాపం తెలుపుతూ టాలీవుడ్ లో రెండు రోజులు షూటింగ్స్ ఆపడం మన ధర్మం అంటూ ఆయన ట్వీట్స్ చేసారు.
భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు! కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి, మోహనబాబుగారికి, బాలయ్యకి , ప్రభాస్ కి,మహేష్, కల్యాణ్ కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. అంటూ @urstrulyMahesh, @PawanKalyan, @KChiruTweets, @AlwaysRamCharan, @alluarjunn, @themohanbabu, @tarak9999, @ssrajamouli లని టాగ్ చేస్తూ ట్వీట్స్ వర్షం కురిపించారు వర్మ.