నిన్న ఆదివారం ఉదయం గుండెపోటుతో తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయిన కృష్ణం రాజు కడసారి చూపుల కోసం ఆయన అభిమానులు నరసాపురం, కృష్ణం రాజు జన్మించిన మొగళ్తూరు, ఇంకా ఏపిలోని పలు జిల్లాల నుండి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి తరలి వస్తున్నారు. ఇటు సినీ, రాజకీయ ప్రముఖులతో కృష్ణ రాజు నివాసం దగ్గర హడావిడి ఎక్కువైంది. ఆయనకి చివరిసారి నివాళు అర్పించేందుకు ప్రముఖులు క్యూ కట్టారు. ఈ రోజు ప్రకాష్ రాజ్, రోజా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జయప్రద కృష్ణం రాజు పార్థివ దేహానికి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
ఈరోజు సోమవారం మధ్యాన్నం 1 గంటకు కృష్ణంరాజు గారి అంత్యక్రియలు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గర లోని కనకమామిడి ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. కృష్ణం రాజు ఇంటినుండి ఉదయం 11:30 గంటలకు ఆయన పార్థివదేహం ఊరేగింపుతో బయలుదేరుతుంది. అయితే కృష్ణం రాజుకు అంతిమ సంస్కారాలు ఆయన సోదరుడి కొడుకు, ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా జరగనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణం రాజుకి ముగ్గురూ అమ్మాయిలే కావడంతో.. ఆయనకి ప్రభాస్ సోదరుడు ప్రభోద్ తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.