తెలుగు సినిమా పరిశ్రమ కొంతమంది వ్యక్తులు కాదు, నాలుగు కుటుంబాల చేతిలో ఉంది అంటూ చిన్నా, పెద్ద నిర్మాతలు కూడా అల్లు అరవింద్, సురేష్ బాబు, అక్కినేని, దిల్ రాజు ఫామిలీస్ పై సంచలన వ్యాఖ్యలు చెయ్యడం చూస్తూనే ఉన్నాం. ఈ నాలుగు కుటుంబాలే సినిమా పరిశ్రమాని శాసిస్తున్నాయి అంటూ వారు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు ఏ చిన్న సినిమాకి థియేటర్స్ దొరకనివ్వరని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కోలీవుడ్ నటి అమలా పాల్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చెయ్యడం సంచలనంగా మారింది. తెలుగులో అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి పెద్ద హీరోలతో నటించిన అమలా పాల్ తర్వాత ఇక్కడ పెద్దగా కనిపించలేదు.
తమిళలో నటిగా బిజీ అయ్యాక తెలుగు వైపు చూడని ఈ భామ కెరీర్ ప్రస్తుతం ఊగిసలాటలో ఉంది. ఈమధ్యన అమలా పాల్ ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. తాను తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేయడానికి గల కారణం ఏమిటో చెప్పుకొచ్చింది. తాను టాలీవుడ్ లోకి ఎంటర్ అయినప్పుడే సినీ పరిశ్రమ కొన్ని ఫామిలీస్ చేతుల్లోనే ఉందన్న విషయం తనకు అర్ధమైంది అని, ఆ కుటుంబాలే సినీ పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్న విషయాన్ని గుర్తించినట్టు చెప్పింది. వారు చేసే, తీసే సినిమాలు కూడా డిఫరెంట్ గా అంటే.. వారి ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారని.. ఆ హీరోయిన్స్ ని గ్లామర్‌గా చూపిస్తూ రొమాంటిక్ సీన్స్, పాటలకు మాత్రమే పరిమితం చేసేవారని అమలాపాల్ ఆరోపిస్తుంది. చాలా కమర్షియల్‌గా సినిమాలు తీసేవారని, అందుకనే తెలుగు ఇండస్ట్రీకి దగ్గర కాలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చెయ్యడం చూసిన నెటిజెన్స్.. అమలా పాల్ చేసిన తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టారు.
రామ్ చరణ్ తో నాయక్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అమలా నటించింది. అందులో కాజల్ మెయిన్ హీరోయిన్. అలాగే అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో చేసింది. అందులోను అమలా కేథరిన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అందుకే అమలా పాల్ ఇలా మాట్లాడి ఉంటుంది అంటూ నెటిజెన్స్ డిసైడ్ అవుతున్నారు.