బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి వెళ్లబోయే ముందు కంటెస్టెంట్స్ లిస్ట్ ఒక వారం ముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినట్టుగానే ఆ లిస్ట్ లోని సభ్యులే బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి అడుగుపెట్టారు. 21 మంది హౌస్ లోకి వెళ్లగా.. మొదటి వారంలో ఆరుగురు నామినేషన్స్ లోకి వెళ్లారు. సోమవారం జరగాల్సిన నామినేషన్స్ ప్రక్రియ ఫస్ట్ టైం బుధవారం జరగడమే ట్విస్ట్ అనుకుంటే .. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేటి అవ్వాల్సి ఉంది. అందుకు తగ్గ ప్రాసెస్ నాగార్జున నడిపించారు కూడా. ముందు సుదీపాని, తర్వాత చంటిని, తర్వాత ఫైమని సేవ్ చేసారు. ఆ తర్వాత రేవంత్, ఆ తర్వాత ఆరోహిని సేవ్ చేసారు.
చివరికి ఇనాయ, అభినయని టాప్ లో నించోబెట్టారు. ఆరోహి, ఇనాయ, అభినయలపై ఎవరికైనా కంప్లైంట్స్ ఉన్నాయా అనగా దానికి అందరూ ఎక్కువగా ఇనాయ పై కంప్లైంట్స్ చెప్పారు. దానితో ఇనాయ తెగ ఏడ్చేసింది. ఇక నామినేషన్స్ లో ఉన్న ఇనాయ-అభినయాలని బయట నించోబెట్టిన నాగార్జున.. 5 నుండి 1 వరకు కౌంట్ చేస్తూ చివరికి ఇద్దరినీ సేవ్ చేసి ఆడియన్స్ కి, హౌస్ మేట్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఒక్క వారానికే ఎవరికీ ఎవరూ అర్ధం కారని, అందుకే ఇద్దరినీ సేవ్ చేసి హౌస్ లో ఉంచినట్టుగా చెప్పారు నాగ్. బిగ్ బాస్ మొదలై ఐదు సీజన్స్ పూర్తి కాగా.. ఫస్ట్ టైం ఇలా మొదటి వారం ఎలిమినేషన్ ఈ సీజన్ లోనే జరగలేదు.