బ్రహ్మాస్త్ర సినిమా కి సోషల్ మీడియాలో ఉన్నంత నెగెటివిటి మరే సినిమాకి వచ్చి ఉండదేమో.. అనుకోవడానికి లేదు. ఎందుకంటే బాలీవుడ్ నుండి ఏ సినిమా రిలీజ్ కి తయారైన కూడా ఇంతే నెగెటివిటి కనబడుతుంది నెటిజెన్స్ నుండి. బ్రహ్మాస్త్ర హాష్ టాగ్ తో పాటుగా, బాయ్ కాట్ అలియా భట్, బాయ్ కాట్ రణబీర్ కపూర్, బాయ్ కాట్ కరణ్ జోహార్ హాష్ టాగ్స్ తో నెటిజెన్స్ తమ నెగిటివి చూపించారు. అయినా బ్రహ్మాస్త్ర టీం అదరకుండా బెదరకుండా రాజమౌళి ని వెంటబెట్టుకుని ప్రమోషన్స్ చేసారు దర్శకుడు అయాన్, కరణ్, రణబీర్, అలియా భట్ లు. మరి బాలీవుడ్ కి బ్రహ్మాస్త్ర ఓ వెలుగు అవుతుంది. ఈ సినిమా హిట్ తో బాలీవుడ్ పూర్వ వైభవాన్ని పొందుతుంది అంటూ చాలామంది కలలుకన్నారు. కానీ బ్రహ్మస్త్ర విడుదల కి ముందు ఎంత క్రేజ్ ఉందో.. విడుదలయ్యాక సినిమాకి ఎక్కువగా నెగెటివ్ టాకే స్ప్రెడ్ అయ్యింది. దీనితో బ్రహ్మస్త్ర పని అవుట్.. మరో డిసాస్టర్ బాలీవుడ్ కొని తెచ్చుకుంది అన్నారు.
కానీ రాజమౌళి శ్రమ, రణబీర్, అలియా భట్ ల కష్టం, అయాన్ నమ్మకం అన్నీ బ్రహ్మాస్త్ర కి అలా అలా కలిసొచ్చాయి. అందుకే నెగెటివ్ టాక్ తోనూ రెండు రోజుల్లో బ్రహ్మస్త్ర వరల్డ్ వైడ్ గా 75 కోట్లు కొల్లగొట్టి అందరికి బిగ్ షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన పెట్టుబడికి వెనక్కి రావడమే కాదు, రెండు రోజుల్లోనే తెలుగు రైట్స్ కొన్న నిర్మాతకి లాభాలొచ్చేశాయి. బాలీవుడ్ లో తప్ప మిగతా అన్ని భాషల్లోనూ బ్రహ్మాస్త్ర మంచి కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఓపెనింగ్ డే వచ్చిన టాక్ కి నిర్మాతల వెన్నులో వణుకు వచ్చేసింది. కానీ రెండో రోజు మొదటి రోజుకన్నా పెరఫార్మెన్స్ బావుండడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటుంటే.. సోషల్ మీడియా నెగెటివిటీని దాటి బ్రహ్మాస్త్ర సక్సెస్ అయ్యింది, బాయ్ కాట్ హాష్ టాగ్స్ కి బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ జవాబు అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. బాయ్ కాట్ హాష్ టాగ్ ని పట్టించుకోకుండా ప్రేక్షకులు థియేటర్స్ వైపు కదలడంతో నెగెటివ్ టాక్ తోనూ అదిరిపోయే కలెక్షన్స్ ఖాతాలో వేసుకుంటుంది బ్రహ్మస్త్ర.