Advertisementt

నారాయణకు డైరెక్ట్ పంచ్ విసిరిన నాగ్

Sun 11th Sep 2022 12:10 PM
nagarjuna,cpi narayana,bigg boss  నారాయణకు డైరెక్ట్ పంచ్ విసిరిన నాగ్
Nag threw a direct punch to Narayana నారాయణకు డైరెక్ట్ పంచ్ విసిరిన నాగ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కల్చర్ చాలా తప్పు అని సిపిఐ నారాయణ బిగ్ బాస్ పై దానికి హోస్ట్ చేస్తున్న నాగార్జున పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. బిగ్ బాస్ హౌస్ అనేది కంటెస్టెంట్స్ మధ్యన గొడవలు పెడుతూ, కొట్టుకోవడమే కాదు, అది పబ్లిక్ గా ప్రేమికులని కలిపే హౌస్, హగ్గులు, ముద్దులు అంటూ చెలరేగిపోవడానికి ఇదో అడ్డా అంటూ ఆయన పచ్చిగా మాట్లాడిన విషయం తెలిసిందే. దానికి హోస్ట్ చేస్తున్న నాగార్జున ఆ కల్చర్ ని ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన మీడియా ముఖంగానే విమర్శిస్తూ ఉంటారు. అయితే సిపిఐ నారాయణకు నాగార్జున గత శనివారం ఎపిసోడ్ లో డైరెక్ట్ గా పంచ్ వెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

నిన్న రాత్రి ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ సిక్స్ లోకి జంటగా వెళ్ళిన రోహిత్ - మరీనా ల మధ్యన జరిగిన ముద్దు విషయాన్ని ఆయన ఓపెన్ గానే చెప్పేసారు. మరీనా-రోహిత్ జంట ని గట్టిగా హాగ్ చేసుకోమని చెప్పిన నాగార్జున నారాయణ నారాయణ అంటూ నారాయణ గారికి పంచ్ వేస్తూ.. మీకు లైసెన్స్ ఉంది పెళ్లి అయ్యింది అనే ఉద్దేశ్యంతో నాగ్ అలా చెయ్యడం ఇప్పుడు సంచలనంగా మారింది. నారాయణ దేనిని నైతే విమర్శిస్తున్నారో అదే స్టేజ్ పై నుండి నాగ్ ఇలాంటి పంచ్ వెయ్యడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

Nag threw a direct punch to Narayana:

Nagarjuna direct punch to CPI Narayana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ