Advertisementt

కోలుకుంటారనుకున్నా.. కానీ: పవన్ కల్యాణ్

Sat 17th Sep 2022 09:41 PM
krishnam raju,rip sir,tribute,pawan kalyan,rebel star,krishnam raju no more  కోలుకుంటారనుకున్నా.. కానీ: పవన్ కల్యాణ్
Pawan Kalyan Pays Tribute to Krishnam Raju కోలుకుంటారనుకున్నా.. కానీ: పవన్ కల్యాణ్
Advertisement

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల అస్వస్థతకు గురయ్యారని తెలిసి.. త్వరగానే ఆయన కోలుకుంటారని భావించాను.. కానీ సడెన్‌గా ఇలాంటి వార్త వినాల్సి రావడంతో దిగ్భాంతికి గురయ్యానని విచారం వ్యక్తం చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. ఒకే ఊరి వారు కావడంతో.. ఇరు ఫ్యామిలీలకు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయని తెలుపుతూ.. కృష్ణంరాజు నటన శైలి గురించి ఆయన ప్రస్తావించారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా కృష్ణంరాజు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా.. జనసేన తరపున అధికారికంగా ఓ లేఖను విడుదల చేశారు. 

 

‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

మా కుటుంబంతో శ్రీ కృష్ణంరాజు గారికి స్నేహసంబంధాలు ఉన్నాయి. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో శ్రీ కృష్ణంరాజు గారితో కలసి అన్నయ్య శ్రీ చిరంజీవి గారు నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ‘భక్త కన్నప్ప’లో శ్రీ కృష్ణంరాజు గారి అభినయం ప్రత్యేకం. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారు. బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయి. ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరపున బరిలో నిలిచారు. 

సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. శ్రీ కృష్ణంరాజు గారి కుటుంబానికి నా తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

(పవన్ కళ్యాణ్)’’ అని పవన్ కల్యాణ్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Pawan Kalyan Pays Tribute to Krishnam Raju:

Pawan Kalyan pays respects to Krishnam Raju

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement