Advertisementt

కృష్ణంరాజు.. చివరి కోరిక తీరకుండానే..!

Tue 13th Sep 2022 11:21 AM
rebel star,krishnam raju,prabhas marriage,last wish,krishnam raju last wish  కృష్ణంరాజు.. చివరి కోరిక తీరకుండానే..!
Krishnam Raju Last Wish Unfulfilled కృష్ణంరాజు.. చివరి కోరిక తీరకుండానే..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ రెబల్ స్టార్, ప్రభాస్‌కి పెదనాన్న అయినటువంటి కృష్ణంరాజు ఆదివారం ఉదయం 3 గంటల 25 నిమిషాలకు.. హైదరాబాద్ AIG హాస్పిటల్‌లో చికిత్స పొందరూ మృతిచెందారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజును ఫ్యామిలీ సభ్యులు AIG హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గత రాత్రి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో.. ఆయన హఠాన్మరణపాలయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే కృష్ణంరాజు తన చివరి కోరిక తీరకుండానే మృతిచెందడం బాధాకరం.

 

ఇంతకీ ఆయన చివరి కోరిక ఏమిటనుకుంటున్నారు? ప్రభాస్ పెళ్లి. పలు సందర్భాలలో ఆయన ప్రభాస్ పెళ్లి ప్రస్తావనను తీసుకువచ్చారు. ఇదిగో ఈ యేడాది ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేస్తున్నామని కృష్ణంరాజు చెప్పిన సందర్భాలెన్నో ఉన్నాయి. ప్రభాస్ పెళ్లి చూడాలనే ఆయన కోరిక తీరకుండానే ఈరోజు అనంతలోకాలకు ఆయన వెళ్లిపోయారు. ప్రభాస్ పెళ్లి విషయంలో.. ఇప్పటికే అనేకానేక రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి కానీ.. ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. తనకి మగ పిల్లలు లేకపోయినా.. తమ్ముడి కుమారుడైన ప్రభాస్‌నే తన వారసుడిగా మొదటి నుండి కృష్ణంరాజు చెబుతూ వచ్చారు. ఆ వారసుడి పెళ్లి చూడకుండానే.. తన చివరి కోరిక తీరకుండానే కృష్ణంరాజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Krishnam Raju Last Wish Unfulfilled:

Rebel Star Krishmam Raju is no more

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ