Advertisementt

ఆసుపత్రిలో ప్రభాస్: వీడియోపై డైలమా

Sat 10th Sep 2022 07:49 PM
prabhas hospital,social media,salaar  ఆసుపత్రిలో ప్రభాస్: వీడియోపై డైలమా
Prabhas hospital video goes viral ఆసుపత్రిలో ప్రభాస్: వీడియోపై డైలమా
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయంలో ఏ చిన్న అప్ డేట్ అయినా.. ప్రభాస్ ఫాన్స్ నెట్టింట్లో వైరల్ గా మార్చేస్తుంటారు. వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న ప్రభాస్ రీసెంట్ గా ఓ చిన్న ఆపరేషన్ ని చేయించుకున్నారని, దాని కోసం ఆయన స్పెషల్ గా విదేశాలకు కూడా వెళ్ళినట్టుగా చెప్పారు. అందుకే ప్రాజెక్ట్ K అండ్ సలార్ షూటింగ్స్ కి ప్రభాస్ బ్రేకిచ్చారు. గత నెలలో విడుదలైన సీత రామం ఈవెంట్ అప్పుడే ప్రభాస్ మోకాలి ఆపరేషన్ కి వెళుతున్నట్టుగా అశ్విని దత్ చెప్పారు. తర్వాత ఆయన ఆ ఈవెంట్ కి కూడా హాజరై ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చారు.

అయితే ఇప్పుడు ప్రభాస్ ఆసుపత్రిలో అలా నడిచొస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ఎప్పటిదో పాత వీడియో అని కొంతమంది అంటుంటే.. కాదు కాదు అది కొత్త వీడియోనే అని ఇంకొందరు అంటున్నారు. ప్రభాస్‌కు ఏమైందని ఆయన ఫాన్స్ కాస్త ఆందోళన పడుతున్నారు కూడా. ఆ వీడియో గురించిన సరైన ఇన్పర్మేషన్ ఎవరి వద్దా లేదు. కానీ ఆ వీడియో మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కానీ ప్రభాస్ ని ఆ వీడియోలో చూస్తే ఆయన ఆరోగ్యంగానే కనిపించారు. హెయిర్ కనిపించకుండా ఎప్పటిలాగే క్లాత్ తో కవర్ చేసి కనిపించారు. ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ ఆ వీడియో ని ట్రెండ్ చేస్తున్నారన్నమాటే కానీ.. వారిలో ఆ వీడియో పాతదో లేదా కొత్తదో అనే అర్ధం కానీ డైలమాలో ఉన్నారు.

 

Prabhas hospital video goes viral :

Prabhas hospital video goes viral in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ