టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ డిసాస్టర్ తో డిస్పాయింట్ అయ్యారు. పూరి అండ్ ఛార్మీలు సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా లైగర్ ప్లాప్ తర్వాత పూరి ముంబైలోని ఆఫీస్ ని ఖాళీ చేసి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడనే వార్తలూ చూసాము. తాజాగా పూరి జగన్నాథ్ దగ్గర గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సాయి కుమార్ అనే వ్యక్తి సూయిసైడ్ చేసుకోవడం టాలీవుడ్ లో కలకలం సృష్టించింది. సాయి కుమార్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
కొద్ది రోజుల క్రితం సాయి కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకి పాల్పడగా.. అతని వివరాలు సేకరించిన పోలీస్ లు.. అతను పూరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సాయి కుమార్ అని తెలుసుకున్నారట. సాయి కుమార్ గత కొంతకాలంగా అప్పులు సమస్యతో, ఆర్ధిక పరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడని, అప్పు ఇచ్చిన వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేకే అతను దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీస్ విచారణలో తేలినట్లుగా చెబుతున్నారు.