విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాస్త ఓవర్ చేసాడనే అభిప్రాయాలు నెటిజెన్స్ వ్యక్తం చేసారు. ప్రతి లైగర్ ఈవెంట్ లో తన కోసం వస్తున్న అభిమానులని చూసిన విజయ్ దేవరకొండ లైగర్ పక్కా హిట్ అని నమ్మి ఎక్కువగా మాట్లాడేసాడు. హైదరాబాద్ లో లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన రౌడీ ఫాన్స్ ని చూసి రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ మా తాత తెల్వడు, మా అయ్యా తెల్వడు.. ఏంది రా ఈ అభిమానం.. నా మీద ఎందుకింత అభిమానం అంటూ మాట్లాడిన మాటలు అప్పట్లోనే టాలీవుడ్ లో సంచలనాన్ని క్రియేట్ చేసాయి.
అయితే లైగర్ సినిమా ప్లాప్ అయ్యాక విజయ్ దేవరకొండ పై చాలా ట్రోలింగ్ నడిచింది. విజయ్ దేవరకొండ కి ఏం చూసుకుని అంత బలుపు అన్నారు. విజయ్ బాగా ఎక్కువ చేసాడు అందుకే లైగర్ దొబ్బింది అన్నారు. అదలా ఉంటే.. రీసెంట్ గా ఈటివి లో ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో విజయ్ దేవరకొండ పై డైరెక్ట్ పంచ్ పడింది. బుల్లెట్ భాస్కర్ వర్ష, ఇంకో అమ్మాయి తో తాను నటించిన దిగుద్ది సినిమా ప్రమోషన్స్ కోసం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఇమ్మాన్యువల్.. ఇంకా స్కిట్ లోని కొందరు హడావిడి చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వగా.. అది చూసిన భాస్కర్ ఏందిరా ఈ అభిమానం, మా అయ్యా తెల్వడు, తాత తెల్వడు ఈ అభిమానం ఏంటి అంటూ విజయ్ దేవరకొండ ని ఉద్దేశించి డైరెక్ట్ గా పంచ్ విసిరాడు. అది చూసిన నెటిజెన్స్.. బుల్లెట్ భాస్కర్ విజయ్ కి దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.